Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Miryalaguda TUFC IDC : మిర్యాలగూడ టియుఎఫ్ ఐడిసి పనులను త్వరితగతిన పూర్తి

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

Miryalaguda TUFC IDC :ప్రజా దీవెన, మిర్యాలగూడ:మిర్యాలగూడ మున్సిపాలిటీ పరి ధిలో చేపట్టిన టి యు ఎఫ్ ఐ డి సి పనులను త్వరితగతిన పూర్తి చే యాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె మి ర్యాలగూడ శాసనసభ్యులు బత్తు ల లక్ష్మారెడ్డితో కలిసి మిర్యాలగూ డ పట్టణంలోని కళాభారతిలో ము న్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పను లపై సమీక్షించారు.

ముందుగా జిల్లా కలెక్టర్, శాసనస భ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పట్టణం లో షాదీఖాన కు ఎంపికచేసిన స్థ లాన్ని, తడకమళ్ళ జంక్షన్ ను తది తర ప్రదేశాలను పరిశీలించారు.

అనంతరం సమీక్షిస్తూ షాదీఖాన పనులు మొదలుపెట్టాలని, అయి తే ప్రస్తుతం ఉన్న స్థలం సరిపోనం దున పక్కనే ఉన్న స్థలాన్ని సేకరిం చేందుకు ప్రతిపాదనలు పంపించా లని కలెక్టర్ ఆదేశించారు. తడకమ ళ్ళ జంక్షన్ లో నిర్మాణాల వల్ల ట్రా ఫిక్ కు అంతరాయంతో పాటు ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితు లను దృష్టిలో ఉంచుకొని వాటిని సరి చేసేందుకు చర్యలు చేపట్టాల ని తెలిపారు. అలాగే పట్టణంలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించి ప్రతిపాది స్తే రోడ్లు భవనాల శాఖ ద్వారా సరి చేయడం జరుగుతుందని తెలిపా రు.

నాలుగో వార్డ్ లో ఉన్న డంపింగ్ యార్డ్ 6 ఎకరాలలో ఉన్నందున అది సరిపోనందున పట్టణానికి దూరంగా స్థలాన్ని గుర్తించాలని ఆమె అధికారులను ఆదేశించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీలో న లుగురు శానిటేషన్ కార్మికులను ఇండోర్ పంపేందుకు సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమా వేశంలో టెండర్ల జారీ, కోర్టు కేసుల పరిష్కారం, తదితర అంశాలపై స మీక్షించారు.

మున్సిపల్ కార్మికులు తాగునీరు, పారిశుద్ధ్యం తో పాటు అన్ని రకాల విధులు నిర్వర్తించాలని, అన్ని ప నుల నిర్వహణపై శ్రద్ద తీసుకోవా లన్నారు.జనాభా ప్రాతిపదికన కా ర్మికులను పెంచే విషయంపై లేఖ రాయాలని అన్నారు. పట్టణంలో బ్లాక్ స్పాట్లను రోడ్డు భద్రత కింద సరిచేసేందుకు ప్రతి పాదనాలను పంపించాలన్నారు. కోర్టు కేసులను జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రెఫర్ చేయాలని చెప్పారు. ఆర్ అండ్ బి ఫ్లైఓవర్ సమస్యలు ఆర్ అండ్ బి ద్వారా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ సమావేశానికి మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ యూసుఫ్ ,స్థానిక తహసిల్దార్ లచ్చిరామ్,తదితరులు హాజర య్యారు.