–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Nellikallu Lift Irrigation : ప్రజా దీవెన, మిర్యాలగూడ: నెల్లి కల్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద భూసే కర ణ పూర్తయినందున తదుపరి ప్రక్రి యను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఇరిగేషన్ అధి కారులను ఆదేశించారు. శనివారం ఆమె మిర్యాలగూడ సబ్ క లెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ ప్రా జెక్టు పనులపై మిర్యాలగూడ శాసనస భ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జు నసాగర్ శాసనసభ్యులు కుందూ రు జయవీర్ రెడ్డిలతో కలిసి సమీ క్ష నిర్వహించారు.
నెల్లికల్ లిఫ్టు ఇరిగేషన్ కు సంబం ధించి పిఎన్ పూర్తయినందున బి ల్లుల చెల్లింపును తదుపరి ప్రక్రియ ను వేగవంతం చేయాలని చెప్పా రు. కాగా నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి భూసేకరణ పేపర్ నో టిఫికేషన్ ఇదివరకే జారీ చేయడం జరిగింది. ఇందుకు సంబంధిం చిన చెల్లింపులు చేయాల్సి ఉన్నందున వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల ని అన్నారు. అదేవిధంగా విద్యుత్ ఛార్జీలపై సైతం ఈ సమీక్ష సంద ర్భంగా సమీక్షించి సమస్యను పరి ష్కరించేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.
నిడమనూరు చెరువుకు నాగా ర్జు నసాగర్ మెయిన్ కెనాల్ నుండి నీ రు ఇచ్చేలా చర్యలు తీసుకోవాల ని ముఖ్యంగా నిడమనూరు ట్యాం కుకు ఓటి ద్వారా నీళ్లు నింపేందుకు ప్రణాళిక రూపొందించాలని ఇంజ నీరింగ్ అధికారులను ఆదేశించా రు.
మిర్యాలగూడ నియోజకవర్గానికి సంబంధించి దున్నపోతుల గండి, పోతుల పాలెం, వీర్లపాలెం భూసేక రణ తో పాటు, రెండు లిఫ్టులకు ఇ ది వరకే ఎంజాయ్మెంట్ సర్వే పూర్త యినందున తదుపరి ప్రక్రియపై దృ ష్టి కేంద్రీకరించాలని ఆమె ఆదేశిం చారు. అదేవిధంగా మిగిలిన లెఫ్ట్ ఇరిగేషన్ భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.
ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డిలు మా ట్లాడుతూ తమ తమ నియోజక వర్గాలలో పెండింగ్లో ఉన్న ఎత్తిపో తల పథకాల పనులను, భూసేకర ణ పనులను త్వరితగతిన పూర్తిచే సేలా చర్యలు తీసుకోవాలని కోరా రు.
శాసనమండలి సభ్యులు శంకర్ నాయక్,మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇరిగేషన్ ఎస్. ఈ మల్లికార్జున్, ఈ ఈ కరుణాకర్, డిఈ కేశవ్, ఇతర ఇంజనీరింగ్ అధి కారులు, రెవిన్యూ అధికారులు, తదితరులు హాజరయ్యారు.