— రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
Sitarama Sitamma Sagar Projects :ప్రజా దీవెన, హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చే యనున్న సీతారామ ప్రాజెక్టు, సీత మ్మ సాగర్ మల్టిపర్పస్ ప్రాజెక్టుల పూర్తికి ప్రణాళికలు రూపొందిం చుకున్నామని రాష్ట్ర నీటిపారుద ల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.రెండు ప్రాజెక్టులను పూర్తి చేసి 7.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సంకల్పమన్నారు.
శనివారం రోజున నీటిపారుదల శాఖా కేంద్ర కార్యాలయం జలసౌధ లో ఆ రెండు ప్రాజెక్టుల పురోగతి పై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ర్రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫ రాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్త మ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ సమావేశంలో ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్య వసాయ శాఖామంత్రి తుమ్మల నా గేశ్వరరావు, రెవిన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటిపారు దల శాఖా ప్రత్యేక కార్యదర్శి ప్రశాం త్ జీవన్ పాటిల్,ఆర్&ఆర్ కమిష నర్ వినయ్ కృష్ణారెడ్డి, నీటిపారుద ల శాఖా సలహాదయూ అదిత్యా దాస్ నాధ్,ఇ. ఎన్.సి అనిల్ కుమా ర్,సి.ఇ శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు
అనంతరం జరిగిన విలేకరుల స మావేశంలో మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి మాట్లాడుతూ సీతరామ ప్రాజెక్టు కు గత ప్రభుత్వ హయాం లో నీటి కేటాయింపులు సాధించ లేక పోయిందని ఆయన తెలిపా రు.
కేవలం 16 నెలల వ్యవధిలో కాం గ్రెస్ ప్రభుత్వం సి.డబ్ల్యూ.సి ని ఒ ప్పించి 67 టి.యం.సి ల నీటిని కే టాయించుకున్నట్లు ఆయన వెల్ల డించారు. ప్రాజెక్టు పురోగతి పై ఆ యన స్పందిస్తూ ఇప్పటికే మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం పూర్తి కా వడంతో పాటు నాలుగో పంప్ హౌ జ్ నిర్మాణ దశలో ఉందన్నారు. మొత్తం మీద ఇప్పటికీ 97 శాతం పనులు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు. పాలేరు లింక్ కెనా ల్,సత్తుపల్లి ట్రంక్ కెనాల్,ఎన్కురు లింక్ కెనాల్లు పురోగతిలో ఉన్నయ ని,భూసేకరణను పూర్తి చేయడం తో పాటు టన్నెల్ నిర్మణాలకు సం బంధించిన పర్యావరణ అనుమ తులు త్వరితగతిన పొందేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నట్లు ఆయన తెలిపారు.
అయితే అదే సమయంలో పనుల లో జరుగుతున్న జాప్యం పై ఆయ న అధికారులను సూటిగా ప్రశ్నిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పర్య టిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్య వేక్షించాలని ఆయన అధికారులకు సూచించారు. తదుపరి సమీక్షా స మావేశం నాటికి భూసేకరణ పురో గతితో పాటు చెల్లింపులకు సంబం ధించిన సమగ్ర సమాచారాన్ని అం దించాలని అధికారులను ఆయన ఆదేశించారు
సీతమ్మ సాగర్ మల్టిపర్పస్ ప్రాజెక్టు కు అవసరమైన పర్యావరణ అను మతులు వేగవంతంగా పూర్తి చేసేం దుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.ఈ ప్రాజెక్టు కు సంబంధించి కొన్ని పనులు అను మతులు లేకుండానే ప్రారంభించి నందుకు జాతీయ హరిత ట్రిబ్యూ నల్ విధించిన 53.41 కోట్ల జరిమా నాను రద్దు పరిచేందుకు చట్టపర మైన చర్యలు తీసుకుంటున్నామ న్నారు.
ఇదే ప్రాజెక్టుకు అనుసంధానంగా ని ర్మిస్తున్న 282.8 మేఘా వాట్ల వి ద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి సంబం ధించిన ప్రతిపాదనలు జెన్కో కు పంపించినట్లు ఆయన తెలిపారు
దుమ్ముగూడెం-పాలేరు మెయిన్ కెనాల్ పూర్తికి చర్యలు తీసుకుంటు న్నామన్నారు. గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యా మలం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర భుత్వం కట్టుబడి పని చేస్తుందని, అందుకు సంబంధించిన ప్రణాళిక లు రూపొందించుకుని పనులలో వేగవంతం పెంచేందుకు అన్ని రకా ల చర్యలు తీసుకున్నామన్నారు.
ఇల్లేందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య ప్రతిపాదించిన ప్రతిపాదనలను పరిశీలనలోకి తీ సుకుంటామన్నారు.సాధ్య సా ధ్యా లను పరిశీలించి తుది నిర్ణయం తీ సుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.