Alumni Meet :ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:యాభై ఐదేళ్ళ తర్వాత చిన్ననాటి స్నేహితులు అంతా ఒకచోట చే రారు. సుమారు 60 ఏళ్ల క్రితం తా ము చదువుకున్న పాఠశాల జ్ఞాప కాలను నెమరు వేసుకుంటూ ఒరే య్ నువ్వా ఎలా ఉండేవాడివి ఎ లా అయిపోయావు. ఎంత మంది పిల్లలు అంటూ ఒకరికొకరు కుశల ప్రశ్నలతో గెట్ టుగెదర్ పార్టీ ఉ త్సాహంగా సాగింది.
నల్లగొండ మల్టీ పర్పస్ హై స్కూల్ 1970 బ్యాచ్ 12వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం సోమాజి గూడలోని ఓ హోటల్లో ఉల్లాసంగా సాగింది. చదువు పూర్తి చేసి 55 ఏ ళ్ల తర్వాత వారంతా ఒకచోట చే రారు. అరేయ్ ఒరేయ్ అంటూ ఒక రినొకరు పలకరించుకున్నారు. అ ప్పటి గురువులు బోధనలను గు ర్తుచేసుకున్నారు. గురువును దైవం కంటే అధికంగా భావించి విద్యాబు ద్ధులు నేర్చుకున్నామని మాజీ పో స్టల్ ఉద్యోగి వెంకన్న తెలిపారు. గు రువే నిజమైన భగవంతుడు అని నమ్మి వారు చెప్పిన విషయాలను తూచా తప్పకుండా పాటించడం వ ల్లే ఈ స్థాయికి ఎదిగామని అ న్నారు.
ఇక్కడ చదివి హైదరాబాద్ నగరం లో స్థిరపడ్డ మంచుకొండ ప్రకాశం తనతో చదువుకున్న విద్యార్థులం దరినీ ఒకచోటకు చేర్చాలని ఆలో చన చేశారు. మిత్రులు వినోద్, వెం కన్నల సహాయంతో నాలుగు నెల ల శ్రమించి గెట్ టు గెదర్ పార్టీ వివ రాలు సేకరించగలిగారు. సుమారు 400 మంది విద్యార్థులు ఉండగా 81 మంది హాజరయ్యారు. ఇన్నా ళ్లు క్షణం తీరిక లేకుండా ఉన్న మ నమంతా ప్రతి ఏడాది ఇలాంటి వే డుకలు జరుపుకుంటామని నిర్ణ యించారు.ఈ కార్యక్రమం మంచు కొండ ప్రకాశం ఆధ్వర్యంలో నిర్వ హించారు. మంచుకొండ ప్రకాశం ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
డెభై సంవత్సరాల వయస్సు పైన ఉన్నవారందరూ ఒక్కసారిగా వారి వయస్సు తగ్గిపోయినట్లుగా భావిం చారు. ఈ సందర్భంగా ప్రకాశం మాట్లాడుతూ అందరిని ఇన్ని సం వత్సరాల తరువాత మిత్రులను క లుసుకోవడం సంతృప్తిని ఇచ్చిం దని చెప్పారు.