–15 వేలలోపు 72 మంది విద్యార్థుల ర్యాంకులు
–అభినందించిన కళాశాల యాజమాన్యం
FSCET 2025 Pragathi Students : ప్రజాదీవెన , నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసిన ఎఫ్ సెట్ 2025 ఫలితాలలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి ప్రభంజనం సృష్టించారు. నల్లగొండ జిల్లాలో మరి ఏ ఇతర కళాశాల సాధించలేని విధంగా ర్యాంకులు సాధించి జిల్లా చరిత్రను తిరగరాశారు.
కళాశాలకు చెందిన కే. ఉజ్వల 314 ర్యాంకు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. అదే విధంగా ఎం. షైని 1306, అరిబా తబస్సుమ్ 1363, పి. సింధు 1847, నబీహ మహీన్ 2812, బి. భవాని 3755, ఆమతుల్ ముజీబ్ షాజాన్ 4294, ఎస్.చరణ్ 4768, కే. సమీరా 5075, కే. యశ్వంత్ 5728, సుహానా ఫిర్దోస్ 5960, ఎన్. సాయి మిత్ర 7055,టి. శ్రీలక్ష్మి 7100, వి. దీక్ష 7464, పి. హాసిని 7561, బి. శిరీష 8031, కే. బాలాజీ 8379, ఐ. నిఖిల్ 8653, ఎస్. శ్రీకాంత్ 8785, కే. హాసిని 9304, ఎల్. నితిన్ సాయి 9681, కే. శ్రేయ రెడ్డి 9888 వరుస ర్యాంకులతో 15 వేల లోపు ర్యాంకులు మొత్తం 72 మంది విద్యార్థులు, 25 వేల లోపు ర్యాంకులు 153 మంది విద్యార్థులు సాధించి “ప్రగతి జూనియర్ కళాశాల”ను జిల్లాలో అగ్రగామి కళాశాలగా నిలిపారు.
ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన కళాశాల విద్యార్థులను వారి తల్లిదండ్రులను అందుకు సహకరించిన అధ్యాపక బృందానికి కళాశాల చైర్మన్ చందాకృష్ణమూర్తి, డైరెక్టర్లు ఎ. నరేందర్ బాబు, ఎన్. శశిధర్ రావు, చందా శ్రీనివాస్, పైళ్ళ రమేష్ రెడ్డి లు అభినందనలు తెలిపారు. పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ప్రణాళికబద్దమైన విద్యాబోధన, అంకితభావం కలిగిన యాజమాన్యం, అధ్యాపకబృందం కృషివలన ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగిందని ప్రిన్సిపల్ తెలియజేశారు.