Yadava Intellectuals Forum :ప్రజాదీవెన,శాలిగౌరారం మే 13:నల్లగొండ జిల్లా యాదవ విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి గా శాలిగౌరారం మండలం అంబారిపేట గ్రామానికి చెందిన నోముల క్రాంతి యాదవ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు బెల్లి నాగరాజు యాదవ్ నియామక పత్రం ను నోముల క్రాంతి యాదవ్ కు అందజేశారు.
ఈ సందర్బంగా జిల్లా కార్యదర్శి గా నియమితులైన క్రాంతి యాదవ్ మాట్లాడుతూ యాదవుల కుల అభివృద్ధికి,విద్యావంతుల వేదిక కార్యక్రమాలను నిర్వహించేందుకు తన శాయాశక్తుల కృషి చేస్తానన్నారు. తన నియమాకానికి కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.