Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chief Justice of India : బిగ్ బ్రేకింగ్, సుప్రీం సిజెఐగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి ప్రమా ణ స్వీకారం

Chief Justice of India : ప్రజా దీవెన , న్యూ ఢిల్లీ : భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీ జేఐ)గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయి బుధవారం ప్రమాణ స్వీ కారంపూర్తి చేశారు. రాష్ట్రపతి ద్రౌ పది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించగా ఈ నియామకంతో జ స్టిస్ గవాయి భారతదేశానికి 52వ ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యత లు చేపట్టినట్ట యింది. దేశ అత్యు న్నత న్యాయ స్థానానికి సారథ్యం వహించనున్న జస్టిస్ గవాయి ని యామకంలో ఒక చారిత్రక విశేషం ఉంది. భారత న్యాయవ్యవస్థ చరి త్రలో ప్రధాన న్యా యమూర్తి పదవి ని అలంకరించిన తొలి బౌద్ధ మత స్థుడిగా ఆయన గుర్తింపు పొందా రు. కాగా గ‌వాయి ప‌దవీ ప్ర‌మాణ స్వీకారానికి ఉప రాష్ట్ర‌ప‌తి ధ‌ న్క‌ డ్, ప్ర‌ధాని మోదీ, ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన జ‌స్టీస్ సంజీవ్ ఖ‌న్నా ఇత‌ర ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. ప్ర‌ధాని నరేంద్రమోదీ ఆయనకు అభినందనలు తెలిపారు.

జస్టిస్ గవాయి నేపద్యం ఇ లా

2019 మే 24 నుంచి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ భూ షణ్ రామకృష్ణ గవాయి అనేక రా జ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడి గా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువ రించారు. సీజేఐగా ఆరు నెలలు కొ నసాగి నవంబరు 23న పదవీవిర మణ చేయనున్నారు. సీజేఐ పీఠా న్ని అధి రోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు. మహారాష్ట్రలోని అమరావతిలో 1960 నవంబరు 24న జన్మించిన గవాయ్ 1985 మార్చి 16న న్యా యవాదిగా వృత్తి జీవితం ప్రారం భించి అంచెలంచెలుగా ఎదిగారు. 2003 నవంబరు 14న బాంబే హై కోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ గవాయ్ 20 05 నవంబరు 12న శాశ్వత న్యా యమూర్తిగా పదోన్నతి పొంది ఆ హైకోర్టు ప్రధాన ధర్మాసనం ఉన్న ముంబయితోపాటు, నాగ్పుర్, ఔ రంగాబాద్, పనాజీ ధర్మాసనాల్లో సేవలందించారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదో న్నతి పొందారు. గత ఆరేళ్లలో జస్టి స్ గవాయ్ సుమారు 700 ధర్మాస నాల్లో భాగస్వామ్యం పంచుకొని రా జ్యాంగ, పరిపాలన, సివిల్, క్రిమిన ల్ చట్టాలు, వాణిజ్య వివాదాలు, ఆర్బిట్రేషన్, విద్యుత్తు, విద్య, ప ర్యావరణానికి సంబంధించిన కే సులను విచారించారు.

తానే ప‌ద‌వీ ఆశించను

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సంజీవ్ ఖన్నా మం గళవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు ఆవరణలో ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ఆయన కీలక ప్రకట న చేశారు. తాను ఇకపై ఏ ప్రభుత్వ పదవినీ చేపట్టబోనని జస్టిస్ సంజీ వ్ ఖన్నా స్పష్టం చేశారు.గతంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తు లుగా, న్యాయమూర్తులుగా పనిచే సిన పలువురు పదవీ విరమణ తర్వాత ప్రభుత్వ పదవులు చేప ట్టిన విషయం తెలిసిందే. ఇది వి మర్శలకు తావిస్తోంది. ఈ తరు ణంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా తాను పదవీ విరమణ తర్వాత ఏ ప్రభు త్వ పదవీ చేపట్టబోనని ప్రకటిం చడం ప్రాధాన్యతను సంతరించు కుంది.

ఇదే క్రమంలో న్యాయవాద వృ త్తిలో పెరిగిపోతున్న అసత్య ధోర ణిని ఆయన ప్రస్తావించారు. న్యా యమూర్తులు, న్యాయవాదులు ప్ర జల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడా నికి కృషి చేయాలని సూచించారు. న్యాయ రంగానికి తన సేవలను కొనసాగిస్తానని ఖన్నా పేర్కొన్నా రు. న్యాయవాదిగా, న్యాయమూర్తి గా తన రెండు ఇన్నింగ్స్‌లు ముగి శాయని, ఇక మూడో ఇన్నింగ్స్‌లో న్యాయరంగానికి సేవలు అందించే మరో పని చేపట్టబోతున్నట్లు తెలి పారు.