Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMRevanthReddy : సీఎం రేవంత్ ఉద్బోధ, ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలి

CMRevanthReddy:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో తరతరాలుగా వాయిదాలు పడుతున్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న చిత్త శుద్ధితో పని చేయాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ లో కొత్తగా నియామకపత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు. తెలంగాణ రైతులు ఆత్మగౌరవం తో బతకడానికి అవ సరమైన నీటి పా రుదల ప్రాజెక్టుల నిర్మాణంలో భా గస్వాములై ప్రజల భావోద్వేగానికి ప్రతీకలుగా నిలబడాలని సూచించారు.

కొలువుల పండుగలో భాగంగా నీ టి పారుదల శాఖలో కొత్తగా ఎంపి కైన 244 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, (AEE), 199 జూని య ర్ టెక్నికల్ ఆఫీసర్స్ (JTO) లకు జలసౌధ ప్రాంగణంలో ఏర్పా టు చేసిన కార్యక్రమంలో నియామక ప త్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్ర సంగిస్తూ తెలంగాణ పునర్నిర్మా ణంలో భాగస్వాములవుతున్న ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినం దనలు తెలియజేశారు.గత నలభై యాభై ఏళ్లుగా రావలసిన నీళ్లు రా కపోగా, పూర్తి కావలసిన ప్రాజెక్టు లు పూర్తి కాని కారణంగా తెలం గా ణకు జరిగిన అన్యాయాన్ని సరిది ద్ది, వాయిదా పడుతున్న ప్రా జెక్టుల ను పూర్తి చేయాలన్న లక్ష్యంతో ప నిచేస్తున్నాం. నీళ్లు ఎంత అవసర మో అందుకు ఎంతగా పరితపించా మో, ఏ నీటి కోసమైతే పోరాటం మొదలైంతో ఆ నీళ్లే తెలంగాణ రా ష్ట్రాన్ని సాధించి పెట్టా యి. అందుకే నీటి పారుదల శాఖకు ప్రభుత్వం అంత ప్రాధాన్యత ఇస్తోంది.

ఉమ్మడి రాష్ట్రంలో నాలుగైదు దశా బ్దాలు వాయిదా పడిన ప్రాజె క్టులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల లో కూడా పూర్తి కాలేదు. జలయ జ్ఞంలో భాగంగా ప్రారంభమైన ప్రాజె క్టులు తెలంగాణ వచ్చి న తర్వాత పదేళ్లలో ఏదీ పూర్తి కాలేదు. ఈనా టికీ వాయిదాలు పడుతూనే ఉన్నా యి. తెలంగాణ ప్రజలకు అతిపెద్ద సెంటిమెంట్ నీళ్లు. ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యత కింద పూర్తి చేస్తాం.

ఇంజనీర్లుగా మీరు చేపట్టే ప్రాజెక్టులు భవిష్యత్తు తరాలకు అందిం చాల్సిన భాధ్యత ఉంది. ఇది నెలనెలా జీతం తీసుకునే ఉద్యోగంగా కాకుండా ఒక బాధ్య తగా, ప్రజల భావోద్వేగంగా తెలం గాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగ స్వాములై రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా రు.

పదేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. గత సెప్టెంబర్ లో ఇదే వేదిక నుంచి 738 అసిస్టెంట్ ఎగ్జి క్యూటివ్ ఇంజనీర్లను, జూనియర్ అసిస్టెంట్లకు నియామాక పత్రాలు అందించి భుజం తట్టాం. మళ్లీ ఈ రోజు 443 ఉద్యోగాలను నియమిం చాం. 14 నెలల కాలంలో ఈ ఒక్క శాఖలోనే 1121 మందిని నియ మించామంటే ఈ శాఖకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి.

ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లు, ప్రత్యేక తెలంగాణలో పదేళ్లు నోటిఫికేషన్ల కోసం కొట్లాడాం. ప్రజా ప్రభుత్వ ప్రా ధాన్యత ఉద్యోగ నియామకాలు. 14 నెలల్లో 60 వేల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశాం. ప్రైవేటు రం గం లో లక్ష ఉద్యోగాలు కల్పించాం. 3 లక్షల కోట్ల రూపాయల మేరకు పె ట్టుబడులను తీసుకొచ్చాం. యువ తకు విద్య, ఉద్యోగాల కల్పన ప్రభు త్వ మొదటి ప్రాధాన్యత. అడ్డంకు లను అధిగమించి తొందర లోనే గ్రూ ప్ I, II, III, IV నియామకాలు పూర్తి చేస్తామని ముఖ్య మంత్రి ఉద్యోగులను ఉద్దేశించి వివరించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్త మ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభా కర్, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శితో పాటు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొ న్నారు.