–రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత
–నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ ఐపీఎస్
Youth Role Model :ప్రజా దీవెన, నల్లగొండ: యువత చెడు వ్యసనాలకు అలవాటు దూ రంగా ఉంటూ గ్రామ ప్రజలకు ఆద ర్శంగా నిలవాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. హాలియా మండల పరిధిలోని కొత్త పల్లి గ్రామానికి సందర్శించి మాట్లా డుతూ గ్రామాల్లో యువత చెడు వ్యసనాలు అలవాటు పడకుండా గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలు స్తూ గ్రామ అభివృధి నేర నియం త్రణకు తోడ్పడాలన్నారు.మిషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా మా దకద్రవాలకు అలవాటు పడిన వారిని టెస్టుల ద్వారా గుర్తించి జిల్లా పోలీస్ కార్యాలయంలో కౌన్సిలింగ్ నిర్వహించి వారిలో పరివర్తన తీసుకురావడం జరిగిం దని తెలిపారు.
అలాగే విలేజ్ పోలీసింగ్ వ్యవస్థ ద్వారా ప్రజలు మెరుగైన సేవలు వినియోగించుకోవచ్చని అన్నారు. ప్రజలకు మరియు పోలీసులకు మ ధ్య సత్సoబంధాలు ఏర్పాటు ద్వా రా నేర నియంత్రణ సాధ్యం అవు తుందని గ్రామ ప్రజలకు అవగా హన కల్పించడం జరిగింది. గ్రా మా ల్లో కి కొత్తగా వచ్చే అను మానుమ నితుల యొక్క సమాచారం ఎప్ప టికప్పుడు గ్రామ ప్రజలు విలేజ్ పో లీస్ అధికారికి అందించడం ద్వా రా గ్రామాల్లో జరిగే నేరాలు నిరోధిం చడానికి ఉపయోగపడతాయని అన్నారు. గ్రామంలో ఏ యొక్క స మస్య ఉన్న విపిఓకి తెలియజేస్తే సంబంధిత అధికారులతో మాట్లా డి మీ సమస్యలు సత్వరమే తీర్చ డానికి కృషి చేయడం జరుగు తుందన్నారు.
గ్రామాల్లో సైబర్ మోసాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండాలని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా గాని మీసేజ్ ల ద్వారా గాని మీ యొక్క సమాచారం అడిగితే ఎట్టి పరిస్థితులలో ఎవరికి సమా చారం అందించకూడదని అన్నా రు. ఎవరైనా గ్రామంలో గాంజా ఇతర మాదకద్రవ్యాలు క్రయ విక్ర యాలు చేస్తే వెంటనే సమాచారం అందించాలని మీ యొక్క వివ రాలు గోప్యంగా ఉంచబడుతా యన్నారు.
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్క రూ బాధ్యతగా,రోడ్డు నియమాలు నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని అ న్నారు. వాహనదారులు వాహన వేగం నిర్ణీత వేగం తగ్గించి నడప డం వల్ల ప్రమాదాలు తగ్గుతాయ ని అన్నారు.
గ్రామంలో ప్రమాదాల నివారణకు విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు ప్ర మాదాలకు గల కారణాలు నివా ర ణకు తీసుకోవాల్సిన చర్యలు ప్ర మాదాల జరిగినప్పుడు తక్షణ చ ర్యలు తీసుకోవడం జరుగుతుంద న్నారు.
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, హాలి యా సిఐ జనార్ధన్ గౌడ్,ఎస్ఐ సతీష్ రెడ్డి,వీపీఓ సరిత,మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.