–కలెక్టర్ త్రిపాఠి
Special Officers :ప్రజాదీవెన నల్గొండ :ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు కావలసిన అన్ని సదుపాయాలను మండల ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి ఈనెల 17లోగా అందజేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం భవిత కేంద్రాల బలోపేతం పై జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 31 భవిత కేంద్రాల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించి, ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్ధులకు కావలసిన అన్ని సదుపాయాలను మండల ప్రత్యేక అధికారుల ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని సూచించారు.
ఈ సమావేశములో భవిత కేంద్రాలలో చేపట్టవలసిన పనులను క్షుణ్ణంగా వివరించారు. భవిత ఆక్టివిటీ రూమ్ , ఫ్రెండ్లీ టాయిలెట్ విత్ రాంప్, రైలింగ్ , ఆక్టివిటీ బేస్డ్ పెయింటింగ్, ఫర్నిచర్ , డ్రింకింగ్, వాటర్ రన్నింగ్, వాటర్ ఏవైడక్ ఏజన్సీ ద్వారా సంబందిత ఏఈ లతో అంచనాలు రూపొంచించుటకు గాను ఆదేశించారు. భవిత కేంద్రాలను విద్యార్ధుల కావాలసినట్లుగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ నారాయణ అమిత్, అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) రాజ్ కుమారు, దేవరకొండ, చండూర్, నల్లగొండ ఆర్డీవోలు లు, జిల్లా విద్యాశాఖాధికారి బి. బిక్షపతి, మండల ప్రత్యేక అధికారులు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.