–డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్
Dengue Prevention : ప్రజాదీవెన నల్గొండ :నల్లగొండ జిల్లాలో డెంగ్యూ నివారణ కై కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ, అర్బన్ మలేరియా ఆశ సిబ్బంది ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి
ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీని ప్రారంభించిన డిఎంహెచ్ఓ శ్రీనివాస్ మాట్లాడుతూ రానున్న వర్షాకాలంలో డెంగ్యూ వ్యాది నివారన కు, లార్వానిర్మూలనకు ప్రజలలో విస్తుృతంగా వారం రోజులపాటు అనగా ఈనెల 23 వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మరేరియా అదికారి డా. కళ్యాణ్ చక్రవర్తి, డిప్యూటి డిఎమ్హెచ్ఓ డా. వేణుగోపాల్ రెడ్డి డీపీవో విష్ణు, హెచ్ ఈ ఓ రవి, అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.