Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CMREVANTHREDDY: బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ తో నోబె ల్ బహుమతి గ్రహీత అభిజిత్ బె నర్జీ భేటీ

బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ తో నోబె ల్ బహుమతి గ్రహీత అభిజిత్ బె నర్జీ భేటీ

CMREVANTHREDDY:   ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా తెలంగా ణ రైజింగ్ సలహా మండలిలో సల హాదారుగా భాగస్వామ్యం కావడా నికి ఆర్థిక శాస్త్ర నిపుణుడు, ఆర్ధ శాస్త్రంలో నోబెల్ బహుమతి గ్రహీ త ప్రొ. అభిజిత్ బెనర్జీ అంగీ కరించారు. ప్రొ. అభిజిత్ బెనర్జీ ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యా దపూర్వకంగా భేటీ అయ్యారు.ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెం టర్ లో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వం చేప ట్టిన చర్యల వంటి అంశాలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ స మావేశంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పా టు ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.

రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యాల సాధనలో భాగంగా వివిధ రంగాల నిపు ణుల తో కూడిన తెలంగాణ రైజింగ్ సల హా మండలిలో పాలుపం చుకోవా లని ఈ భేటీ సందర్భంగా ముఖ్య మంత్రి ఆహ్వానాన్ని బెన ర్జీ అంగీకరించారు.రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉద్యో గాలు, ఉపాధి అవకాశాల కల్పన అంశంపై చర్చిస్తూ, సంప్రదాయ నై పుణ్యాల్లో ఆధునిక డిజైన్, మార్కె టింగ్, సోషల్ మీడియా సాంకేతిక విని యోగంలో విశిష్టత కలిగిన స్వ ల్ప కాలిక కోర్సులను రూపొందిం చాల్సిన అవసరం ఉందని ప్రొ. బె నర్జీ అభిప్రాయపడ్డారు.

తద్వారా సంప్రదాయ కళాకారు ల ను ఆధునిక వ్యాపారవేత్తలుగా తీ ర్చిదిద్దడంలో సహాయపడుతుం దని చెప్పారు. తెలంగాణ ప్రభు త్వం తలపెట్టిన ఫ్యూచర్ సిటీ లో భాగంగా క్రాఫ్ట్స్, ఆర్ట్స్,సృజనాత్మ కత వంటి అంశాలను చేర్చాలని చెప్పారు. ట్రాన్స్ జెండర్లను పో లీస్, మున్సిపల్ శాఖల్లో నియ మించడం, అలాగే, ఔట‌ర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైద‌రాబాద్ కోర్ అర్బ‌న్ ఏరియాను సర్వీస్ సెక్టార్ గా అభివృద్ధి చేసే ప్ర‌ణాళిక ను ఎంచుకోవటం, స్కిల్ యూని వ‌ర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏ ర్పాటు వంటి తెలంగాణ ప్రభుత్వ ప్రణాళికలను ముఖ్యమంత్రి రేవం త్ రెడ్డి దార్శనికతకు అద్దం పడు తోందని ఈ సందర్భంగా అభిజిత్ బెనర్జీ అభినందించారు.

శ‌తాబ్దాల చరిత్ర ఉన్న హైద‌రాబాద్ విజ‌న్ ను, ఇక్క‌డ త‌యార‌య్యే ఉత్ప‌త్తులకు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఆదర‌ణ గురించి ముఖ్య మం త్రి వివరించారు. తెలంగాణ విశిష్ట తలను, ఇక్కడున్న అను కూల వాతావరణాన్ని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. రాష్ట్రంలో మ‌హిళా స్వ‌యం స‌హా య‌క సంఘాలు, రైతుల సాధికా రత, యువతకు ఉద్యోగ అవకా శాలతో పాటు స్కిల్ డెవెలప్మెంట్ దిశగా ప్ర‌భుత్వం చేప‌డుతున్న విప్ల‌ వాత్మ‌క చ‌ర్య‌లను ప్రస్తావించారు.

ఈ సమావేశంలో ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. రామకృష్ణ రావు, ఆర్థి క శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సీఎం ప్రత్యే క కార్యదర్శి అజిత్ రెడ్డి, హైద‌రా బాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనం ద్, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.