— కెంటరీ, మిస్సోరీ రాష్ట్రాల్లో బీభ త్సం సృష్టించిన టోర్నడోలు
–విద్యుత్ సరఫరాలో తీవ్ర అంత రాయం
Devastate Kentucky and Missouri :ప్రజా దీవెన, అమెరికా:అమెరికాలో పెను తుపాన్ బీభ త్సం సృష్టించడంతో 21 మంది దు ర్మరణం పాలయ్యారు. ముఖ్యంగా కెంటకీ, మిస్సోరీ రాష్ట్రాల్లో టోర్న డోలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. కెంటకీ రాష్ట్రంలో 14 మంది, మి స్సోరీ రాష్ట్రంలో ఏడుగురు మృతి చెందారు. కెంటకీలో మృతుల సం ఖ్య మరింత పెరిగే అవకాశం ఉంద ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండీ బేషియ ర్ వెల్లడించారు.
కెంటకీలోని లారెల్ కౌంటీలో టోర్న డో కారణంగా తొమ్మిది మంది మర ణించారని అధికారులు వెల్లడించా రు. అనేక మంది గాయపడ్డారని, ఆస్తినష్టం కూడా భారీగా సంభవిం చిందని తెలిపారు. మిస్సోరీలో ఐ దు వేల భవనాలు ధ్వంసమయ్యా యి. ఇక్కడి సెయింట్ లూయిలో ఐదుగురు మృతి చెందగా, దాదా పు లక్ష నివాసాలకు విద్యుత్ సర ఫరా నిలిచిపోయింది.
ఇల్లినోయీలో కూడా టోర్నడోలు బీ భత్సం సృష్టించినట్లు యూఎస్ నే షనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో అధి కార యంత్రాంగం సహాయక చర్య లు ముమ్మరం చేసింది.