fowls with swords.. Crores that changed hands కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన కోట్లు
--ఆంధ్రలో కోళ్లతో ఆటాడుకున్న పందెం రాయుళ్లు --కృష్ణా,గుంటూరు,తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు --సినిమా సెట్టింగ్‌లను తలదన్నేలా స్వాగత తోరణాలు --వేలాది జూదరుల కోసం విశాలమైన పార్కింగ్ స్థలాలు
కత్తులు దూసిన కోళ్లు.. చేతులు మారిన కోట్లు
–ఆంధ్ర ప్రదేశ్ లో కోళ్లతో ఆటాడుకున్న పందెం రాయుళ్లు
–కృష్ణా,గుంటూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు
–సినిమా సెట్టింగ్‌లను తలదన్నేలా స్వాగత తోరణాలు
–వేలాది జూదరుల కోసం విశాలమైన పార్కింగ్ స్థలాలు
ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా అధికార అనధికార వర్గాల అండదండలతో కోడిపందాల జోరు ( As part of the Sankranti celebrations, there is a rush of cockfights with garlands from the authorities and non-authorities) మాత్రం ఈ దఫా మరింత హుషారుగా కొనసాగింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో భోగి రోజు పెద్ద ఎత్తున కోడి పందేలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
కోళ్ల పందాల్లో పాల్గొనడానికి ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ప్రముఖులు, పందెం రాయుళ్లు వేలాది సంఖ్యలో ( There are thousands of prominent people from districts and states) తరలివచ్చారు. వైకాపా నేతల కనుసన్నల్లో యథేచ్ఛగా పందేలు సాగుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో తీర ప్రాంతం, మెట్ట ప్రాంతం అనే తేడా లేకుండా బరులు వెలిశాయి. గుడివాడ, పెనమలూరు, కైకలూరు, గన్నవరం, ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం నియోజకవర్గాల్లో పందేలు నిర్వహిస్తున్నారు.
పంట పొలాలు, మామిడితోటలను కోండిపందేలకు బరులుగా ( Crop fields and mango groves become burdens for cowpeas) మలిచారు. రాత్రిపూట సైతం పందేలు నిర్వహించేందుకు వీలుగా జనరేటర్లు, ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. కోడిపందేలు నిర్వహించ కూడదని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసుల తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి.
సినిమా సెట్టింగ్‌లను తలపించేలా స్వాగత తోరణాలు...సంక్రాంతి సంబరాల పేరుతో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం అంపాపు రంలో ఏటా మాదిరిగానే భారీ స్థాయిలో కోడిపందేలు, కోతముక్క, ఇతర జూద శిబిరాలు ( Large scale cockfighting, kothamucka and other gambling camps) నిర్వహిస్తున్నారు. 16వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 25 ఎకరాల ప్రైవేటు స్థలంలో ప్రత్యేకంగా బరులు, వేదికలు ఏర్పాటు చేశారు.
మూడురోజుల పాటు జూద శిబిరాలు కొనసాగేలా సకల సౌకర్యాలు కల్పించారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, నియోజకవర్గ వైకాపా నాయకుల చిత్రాలతో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మహి ళలు, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు ( Separate galleries for women and VVIPs) చేశారు. వేల సం ఖ్యలో వచ్చే జూదరుల కోసం విశాలమైన పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తెచ్చారు.
సినిమా సెట్టింగ్‌లను తలపించేలా స్వాగత ద్వారాలు, బౌన్సర్లు, సందర్శకు లకు పాస్‌లు, ఆటగాళ్లకు టోకెన్లు, చేతి కంకణాల వంటి ఏర్పాట్లతో హంగామా చేశారు. పందేల మొదటి రోజే రూ.లక్షల్లో నగదు చేతులు మారుతోంది. పందేలను తిలకించేందుకు వస్తున్న వాహనదారులతో చెన్నై-కోల్‌కతా హైవేతో పాటు సర్వీసు రోడ్లపై ట్రాఫిక్ రద్దీ నెలకొంది.