Jalavihar Journalists’ Conference: జలవిహార్ జర్నలిస్టుల మహాసభ విజయవంతం భారీగా తరలి వెళ్లిన జర్నలిస్టులు
Jalavihar Journalists’ Conference: ప్రజా దీవెన నాంపల్లి : తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001 మే 31న అతికొద్ది మందితో ఏర్పడి సబ్బండ వర్గాలను , అఖిలపక్షాలను , ఐక్యం చేసి తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక దృఢ సంకల్పంతో పనిచేసి ప్రత్యేక రాష్ట్ర సాధన లో ప్రముఖ పాత్ర పోషించిందని నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం అన్నారు.
మే 31, శనివారం నాటికి 25వ సంవత్సరంలోకి టీజేఎఫ్ అడిగిడుతున్న సందర్భంగా హైదరాబాద్ జలవిహార్ లో తలపెట్టిన రజితోత్సవ రాష్ట్ర మహాసభ జాతరకు నాంపల్లి నుండి జర్నలిస్టులతో కలిసి వెళ్తున్న సందర్భంగా ఆయన స్థానిక పాత్రికేయులు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ
మహాసభకు బయలుదేరే ముందు మండల కేంద్ర పట్టణమైన నాంపల్లి లోని అంబేద్కర్ చౌరస్తాలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నీవాళ్లు అర్పించారు.
అనంతరం మహాసభ పోస్టర్లను ప్రదర్శించి వాహనాలలో జర్నలిస్టులో కలిసి ర్యాలీ నిర్వహించారు 25 వసంతాలు పూర్తిచేసుకుని రజతోత్సవం నిర్వహించుకోవడం ఆనందకరమని అన్నారు ఇకముందు జర్నలిస్టులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వంపై పోరాటం నిర్వహిస్తామని అందుకు జర్నలిస్టులు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ ఈద భాస్కర్,నాంపల్లి మండల టి యు డబ్ల్యూ జే – 143 మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షులు రామ్ శెట్టి ప్రెస్ యాదయ్య, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గడ్డం వెంకటేశ్వర్లు,ఉపాధ్యక్షులు జి విజయకుమార్, కర్నాటి భక్తతుకారం, గౌరవ అధ్యక్షుడు కోట అయోధ్య, కార్యదర్శి గాలెంక లింగస్వామి, కోరే పరమేష్ తదితరులు పాల్గొన్నారు.