Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Youth are golden paths for the future: యువత భవితకు బంగారు బాటలు

--ఉమ్మడి తొమ్మిది జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు --యువత మానసిక శారీరక దారుఢ్యం కోసం స్పోర్ట్స్ స్టేడియాలు --యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

యువత భవితకు బంగారు బాటలు

–ఉమ్మడి తొమ్మిది జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ఏర్పాటు
–యువత మానసిక శారీరక దారుఢ్యం కోసం స్పోర్ట్స్ స్టేడియాలు
–యాదాద్రి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్ష

ప్రజా దీవెన/ హైదరాబాద్: రాష్ట్రంలో యువత భవితకు బంగారు బాటలేస్తామని రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వచ్చే యేడాది కాలంలోనే రెండు లక్షల ఉద్యోగ నియమాకాలు చేపడతామని హామీ ఇచ్చారు. శనివా రం సచివాలయంలో క్రీడలశాఖ ముఖ్యకార్యదర్శి శ్రీమతి శైలజ రామయ్యర్, డైరెక్టర్ శ్రీలక్ష్మీ ఇతర క్రీడాశాఖ అధికారులతో రాయగిరి మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం, కాంప్లెక్స్ నిర్మాణ పురోగతిపై తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లోని పాత ఉమ్మడి తొమ్మిది జిల్లా కేంద్రాల్లో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేసి యువతను ఎంటర్ ప్రెన్యూర్స్ గా ( Establish skill development centers and train youth as entrepreneurs)  తీర్చిదిద్దుతామని తెలిపారు.

యువత మానసిక శారీ రక దారుఢ్యం కోసం స్పోర్ట్స్ స్టేడియాలు, ఇతరేతర అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని స్ఫష్టం చేశారు. తెలంగాణ యువత చదు వుతోపాటు క్రీడల్లో కూడా రాణించడం ద్వారా శారీరక, మానసిక ఒత్తిడికి గురి కాకుండ స్వీయ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు.

తదనుగు ణంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఒప్పించి యాదాద్రి జిల్లాలోని రాయగిరి వద్ద నిర్మిస్తున్న మల్టీపర్పస్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం రూ. 10 ఎకరాల భూకేటాయింపు ( For the construction of multipurpose sports stadium being constructed at Rayagiri in Yadadri district Rs. Allotment of 10 acres)  పై తొలి సంతకం చేయించా నని ఆయన గుర్తు చేశారు.

అందుకు సంబంధించిన డిజైన్లను పరిశీ లించిన మంత్రి అత్యాధుని క వసతు లతో కూడిన సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్, స్విమ్మింగ్ పూల్, మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ఉండేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారుల ను ఆదేశించారు. అనంతరం కేంద్రం నుంచి తగిన నిధుల సమీకరించేందుకు రెండు మూడు రోజు ల్లో డీపిఆర్ ను సిద్ధం చేయాలని అధి కారులకు సూచించారు.

తానే స్వయంగా కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తో మాట్లాడి స్టేడియం నిర్మాణానికి ( He himself spoke to Union Sports Minister Anurag Tagore for the construction of the stadium) ఖేలో ఇండి యా పథకంలో భాగంగా నిధులు తీసుకొచ్చెలా ప్రయత్నం చేస్తానని మంత్రి అధికారులకు సూచిం చారు. ఈ సమావేశంలో క్రీడలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీమతి శైలజ రామయ్యర్, డైరెక్టర్ శ్రీలక్ష్మీ, ఆర్ అండ్ బీ ఈఈ శంకరయ్య, స్పోర్ట్స్ అథారిటీ డీఈ అశోక్, జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.