Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutha sukendhar Reddy : పార్టీపై అసంతృప్తి అంటూ దుష్ప్రచారం

--సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు వార్తల ప్రచారం --నల్లగొండ, భువనగిరి ఏదో ఒక ఎంపిగా అమిత్ పోటీలో ఉంటాడు -- మీడియాతో చిట్ చాట్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

పార్టీపై అసంతృప్తి అంటూ దుష్ప్రచారం

–సోషల్ మీడియాలో విస్తృతంగా తప్పుడు వార్తల ప్రచారం
–నల్లగొండ, భువనగిరి ఏదో ఒక ఎంపిగా అమిత్ పోటీలో ఉంటాడు
— మీడియాతో చిట్ చాట్ లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజా దీవెన /హైదరాబాద్: బి ఆర్ యస్ పార్టీ అధిష్టానం పై నేను నారాజ్ గా ఉన్నట్లు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నారని తెలం గాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రధానంగా సోషల్ మీడియాలో పనిగట్టుకొని దుష్ప్ర చారం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి శాసనమండలిలోని తన ఛాంబర్ లో మంగళవారం మీడియాతో చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ భువనగిరి రెండు పార్లమెం టు స్థానాల్లో ఏదో ఒక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి గుత్తా అమిత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని పునరుద్ఘాటించారు. బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ అన్ని రకాలుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడం జరిగిందని, పార్టీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని వివరిం చారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పార్టీ కష్ట కాలంలో ఉన్నప్పుడు పదేళ్లు అధికారం అనుభవించిన నాయకులు, కార్య కర్తలు పార్టీ కోసం పని చేసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్లమెంటు అభ్యర్థిత్వాల విషయంలో మరో రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని, అమిత్ కు నూటికి నూరు శాతం అవకాశం దక్కుతుందన్న భావన వ్యక్తం చేశారు. ఇక నేనే పార్టీ మారుతున్నానని విస్తృత స్థాయిలో పుకార్లు షికార్లు చేస్తున్నాయని, ఎట్టి పరిస్థితుల్లో నాకు పార్టీ మారాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తెలుగు రాష్ట్రాలకు ప్రతిష్టాత్మకమైన నాగార్జున సాగర్ , శ్రీశైలం ప్రాజెక్టులు కృష్ణా రివర్ బోర్డ్ పరిధిలోకి వెళితే తెలంగాణ రాష్ట్రానికి గొడ్డలి పెట్టు అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులు కృష్ణా బోర్డు పరిధిలోకి వెళితే, అదే సందర్భంలో ప్రాజెక్టుల్లో నీటిమట్టాల తాజా పరిస్థితి రానున్న రోజుల్లో త్రాగునీరు సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో పొంచి ఉన్న తాగు తాగునీటి సమస్యలపై రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులను నిరంతర పర్యవేక్షణ చేయడం ద్వారా నీటి సమస్యను రాకుండా చూసుకోవాలని సూచించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పెండింగ్ పనులు అన్ని పూర్తి చేయాలని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన స్వంత జిల్లాలో పెండింగ్ లో ఉన్న పనులపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

దాదాపు 9.5 కిలోమీటర్ల పని పూర్తి చేస్తే SLBC సొరంగం పనులు పూర్తి అవుతాయని గుర్తు చేశారు. వచ్చే బడ్జెట్ సమావేశాలు పాత అసెంబ్లీ హాల్ లో జరుపుకోవాలని చూస్తున్నామని, అంతే వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. అయోధ్య రామాలయం ప్రభావం ఎంత ఉంటుoదో రానున్న ఎన్నికల్లో తేటతెల్లమవుతుందని అన్నారు.

కేసీఆర్ పైన ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలిం చాయి తప్ప మరొకటి కాదని గుర్తు చేశారు.ఇప్పటికే నా కుమారుడు జిల్లా నేతలను అందరిని కలిసాడని, అందరితో సమన్వయంతో కలుపుకుపోయే మనస్తత్వం అమిత్ ది అంటూ వెల్లడించారు. పార్టీ అధినేత ఏ నిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.