Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Ponguleti Srinivasa Reddy: భారీ వ‌ర్షాలు వ‌ర‌ద‌ల‌పై అప్ర‌మ‌త్తం గా ఉండాలి

–వ‌ర‌ద నిర్వ‌హ‌ణ‌కు హైద‌రాబాద్ త‌ర‌హాలోనే జిల్లాల్లో ఏర్పాట్లు
–ప్ర‌కృతి విప‌త్తుల విభాగం బ‌లోపే తానికి ఉన్న‌త స్దాయి క‌మిటీ
–వారం రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని ఆదేశం
–నష్టం జ‌రిగాక కాదు, న‌ష్టం జ‌ర‌గ‌క‌ ముందే స్పందించాలి
–రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, స‌మా చార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌ రెడ్డి

Minister Ponguleti Srinivasa Reddy: ప్రజా దీవెన, హైద‌రాబాద్ : ఈ ఏడా ది రాష్ట్రంలో సాధార‌ణ కంటే ఎక్కు వ వ‌ర్షాలు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ ( ఐఎండీ) హెచ్చ‌ రిక‌ల నేప‌ధ్యంలో గోదావరి కృష్ణా న‌ దీ ప‌రివాహాక ప్రాంతాల్లో వీలైనంత‌ వ‌ర‌కు ప్రాణ , ఆస్ధి, ఆర్ధిక న‌ష్టం జ‌ర‌ గ‌కుండా ఇప్ప‌టి నుండే ప‌క‌ డ్బందీ చ‌ర్య‌లు తీసుకొంటూ అప్ర‌ మ‌త్తంగా ఉండాల‌ని రాష్ట్ర రెవె న్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ మంత్రి పొంగు లేటి శ్రీ‌నివాస‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. గోదావ‌రి , కృష్ణా న‌దీ ప‌రీవాహ‌క ప్రాంతాల్లో వ‌ర‌ద నిర్వ‌ హ‌ణ‌పై ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లతో గురువారం నాడు స‌చివాల‌యం లోని త‌న ఛాంబ‌ర్‌లో మంత్రి పొం గులేటి శ్రీ‌నివాస‌రెడ్డి ఉన్న‌త‌స్ధాయి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు .

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడు తూ ప్ర‌కృతి విప‌త్తుల వ‌ల్ల న‌ష్టం జ‌రిగిన త‌ర్వాత స్పందించేదాని కంటే నష్టం జ‌ర‌గ‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. హైద‌రాబాద్ త‌ర‌హాలోనే రాష్ట్ర స్దా యిలో ప్ర‌ధానంగా వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల‌లో చేప‌ట్ట‌వ‌ల‌సిన చ‌ర్య‌ లు, విప‌త్తుల నిర్వ‌హ‌ణా విభాగం బ‌లోపేతానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ ల‌పై హైడ్రా క‌మీష‌న‌ర్ , అగ్నిమాప‌క డిజీ, విప‌త్తుల నిర్వ‌హ‌ణ క‌మీష‌న‌ ర్ , క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ డైరెక్ట‌ ర్ , నీటిపారుదల‌, ఆర్ & బి, ఆరో గ్య శాఖ‌ల క‌మీష‌న‌ర్ల‌తో ఉన్న‌త స్ధాయి క‌మిటీని ఏర్పాటు చేశామ‌ ని , ఈ క‌మిటీ వారం రోజుల్లో ని వేదిక ఇస్తుంద‌ని క‌మిటీ నివేదిక ప్ర‌కారం చ‌ర్య‌లు చేప‌డ‌తామ‌ని తెలిపారు.

ఈ ఏడాది వ‌ర్షాకాల సీజ‌న్ అనుకు న్న‌దానికంటే 15 రోజుల ముందుగా నే వ‌చ్చింద‌ని, దీనిని దృష్టిలో పెట్టు కొని జిల్లా క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అన్ని విభాగాల‌తో స‌మ‌ న్వ‌యం చేసుకొని ప్ర‌కృతి వైప‌రీ త్యాల ప్ర‌భావం వీలైనంత‌వ‌ర‌కు త‌గ్గించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అన్నారు.

గోదావరి, కృష్ణా నదీ పరీవాహక ప్రదేశాలలో జూలై, ఆగష్టు, సెప్టెం బర్ నెలల్లో హ‌ఠాత్తుగా వ‌చ్చే వ‌ర్షా ల‌ వల్ల ఊహించని వరదలు వస్తు న్నాయ‌ని, గ‌త అనుభ‌వాల‌ను దృ ష్టిలో పెట్టుకొని ఇప్ప‌టి నుంచే ప‌క‌ డ్బందీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ము ఖ్యంగా ప‌రీవాహ‌క ప్రాంతాల్లోని ని వాసితుల‌ను గుర్తించి వారిని అక్క‌ డి నుంచి శాశ్వ‌తంగా త‌ర‌లించి వా రికి ఇందిర‌మ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే విధంగా అధికారులు చ‌ర్య‌లు తీసు కోవాల‌న్నారు. గ‌త ఏడాది గోదావ‌రి ప‌రీవాహ‌క ప్రాంతాల్లో త‌క్కువ స‌మ‌ యంలో ఎక్కువ వ‌ర్షం ప‌డ‌ డం వ‌ల్ల న‌ష్టం ఎక్కువగా జ‌రిగిం ద‌ని ఈసారి కూడా అటువంటి ప‌రి స్ధితి ఎదురైతే న‌ష్టాన్ని త‌గ్గించే వి ధంగా ముంద‌స్తుగా ఏర్పాట్లు చేసు కోవాల‌న్నారు.

రెవెన్యూ విప‌త్తుల నిర్వ‌హ‌ణా శాఖ మూస‌ప‌ద్ద‌తికి స్వ‌స్తి చెప్పి మారు తున్న ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ఉప‌యోగించుకొని అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాల‌న్నా రు . హైద‌రాబాద్ లోని తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెం టర్ కు, నిర్వహణ మరియు ముం దస్తు హెచ్చరికల కోసం అవసరమై న యూజర్ ఐడీల‌ను ఇవ్వాల‌ని , గ‌త అనుభ‌వాల‌ను దృష్టిలో పెట్టు కొని ఆయా జిల్లాల్లో ప‌రిస్ధితుల‌ను బ‌ట్టి వరదల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళి క‌ల‌ను ఈనెల 30వ తేదీలోగా త‌ యారు చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ల‌ ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆపద మిత్ర వాలంటీర్స్, NDRF (అగ్నిమాపక మరియు విప త్తు నిర్వహణ శాఖ, మరియు ప్రత్యేక పోలీస్ విభాగంలోని SDR F) సహాయంతో తో సామాజిక అవ గాహన కార్యక్రమాలు నిర్వహిం చాల‌ని సూచించారు.

వరద నియంత్రణ కట్టలు, చిన్న- మధ్య తరహా కాల్వలు, వర్షపు నీటి డ్రెయిన్‌లు మొదలైన వాటిని పరిశీ లించి మరమ్మత్తులు చేపట్టాల‌న్నా రు. ప్రతి మండలానికి వ‌ర‌ద ప్ర‌తి స్పంద‌న ప్ర‌ణాళిక సిద్ధం చేయాలి ఇందులో ఖాళీ చేయుటకు మార్గా లు, రిలీఫ్ క్యాంపుల ప్రదేశాలు, సం ప్రదించవలసిన నెంబర్లు మొదలైన వి ఉండాలన్నారు. బోట్లు, లైఫ్ జా కెట్లు, అత్యవసర మరియు పొడి ఆహార కిట్లు ముందే సిద్ధంగా ఉం చాలి.ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్ మరియు ఆరోగ్య శాఖల సామా న్యంతో పనిచేయాల‌ని కంట్రోల్ రూ ములు ప్రారంభించాల‌ని అత్యధిక ప్రమాద ప్రాంతాలలో స్థానిక రేస్క్యు బృందాలను ఏర్పాటు చేసి, వారికి ఖాళీ చేయుట, తక్షణ స్పందన చర్యలపై శిక్షణ ఇవ్వాల‌న్నారు.

అత్యవసర సమయాలలో, వరద భద్రత పై తీసుకోవలసిన జాగ్రత్తల పై ప్రజలతో ప్రత్యక్షంగా సమావేశా లు, పబ్లిక్ అడ్రస్ సిస్టంల ద్వారా అవగాహన కల్పించాల‌న్నారు. మొ బైల్ వైద్య బృందాలను, అవసరమై న మందులు, నీటి శుద్ధి మాత్రలు, పారిశుద్ధ్య కిట్లు వంటివి తగిన మొ త్తంలో అందుబాటులో ఉంచాల‌ న్నారు.ఈ స‌మావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ న‌వీన్ మిట్ట‌ ల్, రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ క‌మీష‌న‌ర్ హ‌రీష్‌, అగ్నిమాప‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ నాగిరెడ్డి, హై డ్రా క‌మీష‌న‌ర్ రంగ‌నాధ్‌, పంచాయి తీరాజ్ క‌మీష‌న‌ర్ సృజ‌న‌, సిపి డిసి ఎల్ డైరెక్ట‌ర్ ముష్రాఫ్ అలీ, వ్య‌వ‌సా య స‌హ‌కార శాఖ డైరెక్ట‌ర్ బి. గోపి. ఐఎండీ అధికారిణి నాగ‌ర‌త్నం, ఆది లాబాద్ , భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, జోగు లాంబ గ‌ద్వాల్, ములుగు, నిర్మ‌ల్‌, వ‌న‌ప‌ర్తి జిల్లాల క‌లెక్ట‌ర్లు పాల్గొన్నా రు.