–4వ రీజియన్ మహాసభలో వక్తల పిలుపు
CITU State Vice President Tummala Veera Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆర్టీసీ లో కార్మిక సంఘాలను అను మ తించి కార్మిక సమస్యల ను పరి ష్క రించాలని సిఐటియు రాష్ట్ర ఉపా ధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి ప్ర భు త్వాన్ని డిమాండ్ చేశారు. గురువా రం టి ఎస్ ఆర్ టి సి స్టాఫ్ అండ్ వ ర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్ల గొండ రీజియన్ నాలుగో మహాసభ దోడ్డి కొమరయ్య భవన్లో జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూఆర్టీసి కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అనేక సార్లు రవాణా శాఖ మంత్రి కి, ఆర్టీసి యాజమాన్యానికి వినతిపత్రాలను, ఆర్టీసి యూని యన్లు సమర్పించి. అనేక రూపాల లో ఆందోళనలు నిర్వహించాయని అన్నారు. గత 18 నెలలుగా ప్రభు త్వం నుండి కాని, ఆర్టీసి యాజమా న్యం నుండి కాని ఎలాంటి స్పందన రాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశా రు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2013 బాండ్ల డబ్బులు విడుదల చేయటం, 20 17 వేతన సవరణ జరపటాన్ని ఆర్టీసి కార్మికులు గుర్తుంచుకుంటా రని వారు అన్నారు.
వేతన సవరణ ద్వైపాక్షిక చర్చ ల ద్వారా జరపటం చట్టబద్ధమని, అయితే 2017 వేతన సవరణ ఏక పక్షంగా జరిగిందని, అరియర్స్ ను రిటైర్మెంట్ సమయంలో చెల్లి స్తా మని ప్రకటించి తీరని అన్యాయం చేసిందన్నారు. అందులో అలవెన్సు లు వంటివి ఇంకా అనేకం పరిష్క రించవలసిన సమస్యలు ఉన్నాయ ని వారు అన్నారు. మరో రెండు వేతన సవరణలు, 2017 ఏరియ ర్స్, పెరిగిన పనిభారం, ఉద్యోగ భద్ర త, అధికారుల వేధింపులు లాంటి అనేక సమస్యలతో ఆర్టీసి కార్మికు లు ఇబ్బందిపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కుటుంబ సభ్యులు చనిపోయినా, ఇంట్లో పెళ్ళిళ్ళు ఉన్నా సెలవులు కూడా ఇవ్వకుండా అధికారులు వేధిస్తు న్నారని, యూనియన్ నాయకులు స్పందించి అధికారులతో మాట్లాడ బోతే యూనియన్లు లేవని చెబు తున్నారని వారు అన్నారు.
ఇటువంటి వైఖరి వల్లనే కార్మి కులలో తీవ్రమైన అసంతృప్తి పెరు గుతున్నదని ప్రభుత్వం గుర్తించాల న్నారు.సమస్యలపై సమ్మె దాకా వె ళ్ళొద్దని, రవాణా శాఖా మంత్రితో చర్చించమంటూ ముఖ్యమంత్రి చె ప్పటం మంచిదేనని, అయితే స మస్యలపై వినతిపత్రాలు ఇచ్చిన ప్పుడే యూనియన్లను, మేనేజ్మెం టును కూర్చోబెట్టి చర్చిస్తే సమ్మె దాకా వెళ్ళాల్సిన అవసరమే రాద ని, సమ్మె చేయాలన్న కోరిక ఏ కార్మి కులకు ఉండదని, ఎక్కడైనా విధిలే ని స్థితిలోనే సమ్మెకు వెళతారని, ఇ ప్పుడు కూడా చర్చలకు నిర్దిష్ట ప్ర తిపాదన ఏదీ ప్రభుత్వం నుండి రాలేదని వారు అన్నారు.గత ప్రభు త్వం నిరంకుశ వైఖరితో ఆర్టీసి యూనియన్లను నియంత్రించారని, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే, యూనియ న్ల కార్యకలాపాలు పునరుద్ధరిస్తుం దని, ఆర్టీసి కార్మికులు మనసారా నమ్మి కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేశారని అన్నారు.
కానీ యూనియ న్ల కార్యకలాపాలు ఇంకా అనుమతించకపోవటంతో తమ సమస్యలు చెప్పుకొనే వేది కలు లేకుండా పోయాయని, కార్మి కులు ఎంతో ఆశాభంగం చెందారని ప్రభుత్వం గుర్తించాలని వారు విజ్ఞప్తి చేశారు. తక్షణమే ప్రభుత్వం ఆర్టీbసి కార్మిక సంఘాలతో చర్చ లు జరిపి, సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికుల పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్పు చేసి తె చ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని జూలై 9 న జరు గుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని పిలుపుని చ్చారు.
ఎస్ డబ్ల్యూ ఎఫ్ రాష్ట్ర కోశాధికారి కేఎస్ రెడ్డి, రాష్ట్ర ప్రచార కార్యదర్శి పి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ యూనియన్ నిబంధనల ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసా రి డిపో నుండి రాష్ట్ర ఆల్ ఇండి యా వరకు మహాసభలు నిర్వహిం చి రెండు సంవత్సరాలు చేసిన కా ర్యక్రమాలను సమీక్షించుకొని భవి ష్యత్తు రెండు సంవత్సరాలకు చేప ట్టవలసిన కర్తవ్యాలను రూపొందిం చుకోవడం జరుగుతుందని అన్నా రు. పూర్తిచేసుకుని మరియు గు రువారం రీజియన్ మహాసభ పూర్తి చేసుకోవడం జరిగిందని అన్నారు జూన్ 21 22 తేదీల్లో ఖమ్మంలో 4వ రాష్ట్ర మహాసభ లు నిర్వహిం చడం జరుగుతుందని ఎంపికైన ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజ రుకావాలని పిలుపునివ్వడం జరి గింది.
ఈ మహాసభలో గత రెండు సం వత్సరాల కాలంలో నిర్వహించి న కార్యక్రమాలను రీజియన్ కార్య దర్శి బత్తుల సుధాకర్ కార్యదర్శి నివేదిక ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించడం జరి గింది.ఈ మహాసభలలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంప ల్లి సత్తయ్య రీజియన్ అధ్యక్షులు కందుల నరసింహ రీజియన్ నాయ కులు ఎం సి మౌళి, కే శ్యామ్ సుం దర్, సిహెచ్ రేవతి, కృష్ణయ్య, గులామ్ రసూల్, రవి, రమేష్, లక్ష్మయ్య, బోడ స్వామి, శ్రీ కంట్లం, కె వి రెడ్డి, రాజయ్య, వినయ్ కు మార్, సైదులు, యాదప్పా, నరసిం హయ్య తదితరులు పాల్గొన్నారు