Yadadri Vratham Ticket: ప్రజా దీవెన, యాదగిరిగుట్ట: తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని సందర్శించు కోవడానికి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక సెలవు దినాలు, ప్రత్యేక పర్వదినాల్లో భ క్తుల రద్దీ భారీగా ఉంటుంది. యా దాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆల యానికి వచ్చే భక్తుల్లో ఎక్కువగా స త్యనారాయణస్వామి వ్రతం చే యించుకోవడానికి ఆసక్తి చూపు తారు.
ఈ క్రమంలో ఆలయ దేవస్థాన అధి కారులు సత్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధరను భారీగా పెంచు తూ ఉత్తర్వులు జారీ చేశారు.
యాదాద్రి ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతం టికె ట్ ధరను పెంచుతూ ఈవో వెంకట్రా వు తాజాగా ఉత్తర్వులు జారీ చేశా రు. ఇప్పటివరకు యాదాద్రిలో స త్యనారాయణ స్వామి వ్రతం టికెట్ ధర రూ.800 ఉండగాదాన్ని రూ.1000కి పెంచారు. ఇప్పటివ రకు ఉన్న టికెట్‌పై రూ.800 చెల్లిం చి వ్రతం టికెట్ తీసుకుంటే భక్తుల కు పూజా సామాగ్రి అందించేవారు.
అయితే ఇప్పుడు యాదాద్రి దేవ స్థానం వ్రతం టికెట్ ధరను రూ.10 00కి పెంచారు. ఇకపై ఈ టికెట్ మీ ద భక్తులకు పూజ, ఇతర సామగ్రి తో పాటుగా స్వామివారి శేష వస్త్రా లు అలానే సత్యనారాయణ స్వా మి ప్రతిమను కూడా ఇవ్వనున్నా రు. పెరిగిన టికెట్ ధరలు నేటి నుం చే అమల్లోకి వచ్చాయి.
ఇక యాదాద్రి దేవస్థానంలో మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. భక్తులకు అందించే ఉచిత ప్రసాదా న్ని 100 కిలోల నుంచి 300 కిలోల కు పెంచుతూ యాదాద్రి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి ఉచిత ప్రసాదం ట్రయల్ ను దేవస్థా నం ప్రారంభించింది . దీనిలో భాగం గా నేటి నుంచి జూన్ 30వ తేదీ వర కు ప్రతి రోజు భక్తులకు 300 కేజీల లడ్డూ, 300 కిలోల పులిహోరను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత జులై 1 నుంచి ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయి లో నిర్వహించనున్నట్లు ఆలయ ఈ వో తెలిపారు.