Ex DGP mahendarReddy : ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ నియామకం
--టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి --సభ్యులుగా అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావులు --కమిటీ నియామకాన్ని ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
ఎట్టకేలకు టీఎస్పీఎస్సీ నియామకం
–టీఎస్పీఎస్సీ కమిషన్ చైర్మన్ గా మాజీ డిజిపి మహేందర్ రెడ్డి
–సభ్యులుగా అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావులు
–కమిటీ నియామకాన్ని ఆమోదించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్
ప్రజా దీవెన/ హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (tspsc) చైర్మన్ పదవి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితు లయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి, సభ్యులుగా రిటైర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లాఖాన్, యాదయ్య, వై రాంమోహన్ రావుల నియామకం పూర్త య్యింది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా మహేందర్ రెడ్డి నియామకాన్ని గవ ర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదించదంతో ప్రక్రియ సంపూర్ణ మైంది.
టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తు లు చేసుకోగా ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియామకం ద్వారా దరఖా స్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలు అప్పగించింది. సద రు కమిటీ శరవేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టి చైర్మన్ ను, స భ్యులను ఎంపిక చేపట్టింది.
చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసుకు న్న వారిలో నుంచి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పేరును సెర్చ్ కమి టీ ప్రభుత్వానికి సూచించగా ప్రభుత్వం ఆ పేరును గవర్నర్ పరిశీల నకు పంపి ఆమోదo పొందారు. ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితం వరకు ఐఏఎస్ అధికారి జనార్ధన్ రెడ్డి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా కొనసా గిన సంగతి తెలిసిందే.
ఆయన హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రా లు లీక్ కావడంతో పలు పరీక్షలు వాయిదాపడిన విషయం కూడా తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీఎస్పీ ఎస్సీ ప్రక్షాళన దిశగా అడుగులు వేయడంతో చైర్మన్‌తో పాటు సభ్యు లందరూ రాజీనామా చేశారు. ఇదిలా ఉండగా ముది రెడ్డి మహేంద ర్ రెడ్డి ఖమ్మం జిల్లా మధిర మండలం కిష్ణాపు రంలో 1962 డిసెంబ ర్ 3న జన్మించారు.
మహేందర్‌రెడ్డి 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాగా మహేందర్ రెడ్డి ఐపీఎస్‌గా 36 ఏండ్ల పాటు సుదీర్ఘ కాలం పా టు సేవలందించారు. పోలీసు శాఖలో సాంకేతికతతో విప్లవాత్మక మార్పులు తెచ్చినఘనత కూడా ఆయన దే. 2022 డిసెంబర్ 31వ తేదీన మహేందర్ రెడ్డి పదవీ విరమణ చేశారు.
డీజీపీ అనురాగ్ శర్మ పదవీ విరమణ తర్వాత 2017 నవం బర్ 12న ఇంచార్జి డీజీపీగా నియమితుల య్యారు. 2018, ఏప్రిల్ 10న పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు. మూడేండ్లకు పైగా తన పదవీ కా లంలో ఆయన రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడ టంలోనూ కీల కంగా వ్యవహరించారు.
అందుకే 2020, ఏప్రిల్ 8న దేశంలోని టాప్ 25 ఐపీఎస్ అధికారుల జాబితాలో 8వ స్థానాన్ని మహేందర్ రెడ్డి దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా నియా మకమైన మహేందర్ రెడ్డి ఈ ఏడాది డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే కమిషన్ నిబంధనల ప్రకారం 62 ఏండ్లు దాటితే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.