Cm Jagan MohanReddy: ఏపీలో ఎలక్షన్స్ ఎప్పుడో తెలుసా
--ఆ నెలలోనే జరిపేందుకు ఎన్నికల సంఘం సుస్పష్టం --లోక్ సభతో పాటే ఏపీ ఎన్నికలకు కేంద్రం సుముఖం --మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఏదో ఒక నెలలో జరిపేందుకు సన్నద్ధం --తారాస్థాయికి చేరుకున్న రాజకీయ పార్టీల సమరం
ఏపీలో ఎలక్షన్స్ ఎప్పుడో తెలుసా
–ఆ నెలలోనే జరిపేందుకు ఎన్నికల సంఘం సుస్పష్టం
–లోక్ సభతో పాటే ఏపీ ఎన్నికలకు కేంద్రం సుముఖం
–మార్చి, ఏప్రిల్ మాసాల్లో ఏదో ఒక నెలలో జరిపేందుకు సన్నద్ధం
–తారాస్థాయికి చేరుకున్న రాజకీయ పార్టీల సమరం
ప్రజా దీవెన/న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో లోక్ సభ తో పాటే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకా శాలు మెండుగా ఉన్నాయని తెలుస్తొంది. ఆ రెండు నెలల్లోనే ఏపీలో ఎలక్షన్స్ నిర్వహించే సూచనలు ప్రస్తుతం బలంగా కనిపిస్తున్నాయ నేది రాజకీయ పరిశీలకుల అంచనా. ఏప్రిల్‌లోనే లోక్‌సభ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉండడంతో ఈ ఎలక్షన్స్‌కు రాజకీయ నేతల తో పాటు ఎలక్షన్ కమిషన్ సిద్ధమయినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ నెలలో జనరల్ ఎలక్షన్స్ రిఫరెన్స్ తేదీ దృష్టిలో ఉంచుకొని సజావుగా పోలింగ్ పూర్తి అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఈఓ ఏపీ అధికారులను ఇప్పటికే ఆదేశించింది. ఆ ఆదేశాలను అనుసరిస్తూ కేంద్ర ఎన్నికల అధికారులు ఏపీ ఎన్నికల ఏర్పాటుపై దృష్టి సారించి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు.
కొద్ది రోజుల క్రితమే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల లిస్టును రిలీజ్ చేశారు కూడా. ఏపీలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దాదాపు ఏక కాలంలో జరిగే అవకాశం ఉంది కాబట్టి ఏర్పాట్లను త్వరితగతిన సక్రమంగా పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఉన్నత అధికారులు నొక్కి చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ పై అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పటినుంచే దానికోసం ముందస్తు చర్యలు సీఈసీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ ఎలక్షన్లకు అన్ని రాష్ట్రాలు సిద్ధం కావాలని కోరుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రీసెంట్ గా ఎన్నికల అధికారులు మూడు రోజులు పర్యటించారు.
రాష్ట్రంలో కీలకంగా ఉన్న రాజకీయ పార్టీలతో పాటు, పోలీసులు, కలెక్టర్లతో వరుస సమావేశాలు నిర్వహించి ముఖ్య విషయాలు చర్చించారు. పర్యటన ముగిసిన తరువాత ఢిల్లీ నుంచే ఏపీ ఎన్నిక ల ప్రిపరేషన్స్ పర్యవేక్షిస్తున్నారు.ఫిబ్రవరి చివరి వారంలో లేదంటే మార్చి మొదటి వారంలో లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయొ చ్చని కొందరు అధికారులు తెలుపుతున్నారు.
వీటితో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగవచ్చనే సంకేతాలు బలం గా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ ఎన్నికల ఏర్పాట్లను సైతం అధికారు లు ముమ్మరం చేశారు. మరోవైపు అధికార, ప్రతిపక్షాలను రాజకీయ పార్టీలు ప్రచారాలను మరింత ముమ్మరం చేశాయి. అధికార, విపక్షా లన్నీ విజయ కేతనం ఎగురవేసేందుకు, ఓటర్లను ఆకర్షించేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈసారి సీఎం పదవిని ఎవరు గెలుచుకుం టారనేది సస్పెన్స్ గా మా రింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలంద రూ సంతృప్తిగా ఉన్నారా, లేదంటే టీడీపీ కూటమి పార్టీని ఈసారి గెలిపి స్తారా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరోవైపు సీఎం జగన్ సోదరి వైఎస్ఆర్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి అధికార పార్టీకి వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
దీంతో ఏపీ రాజకీయాలు మరింత హీటెక్కిన పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు ఎవరికి వారు వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీ బిజీ గా గడుపు తున్నాయి. ఏపీలో ఒకేసారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండడంతో ఆయా పార్టీల్లో గుబులు నెలకొంది.
ఈ దఫా అంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అర్థం లేకుండా అన్ని పార్టీలు ఉత్కంఠ భరిత వాతావరణాన్ని ఎదుర్కొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారం చేపట్టబోతోందో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.