–సివిల్ విషయాల్లో జోక్యంపై పోలీ సుల పై హైకోర్టు సీరియస్
ప్రజాదీవెన, హైదరాబాద్:
High Court: పోలీసులు శాంతి భద్రతల కంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకుంటున్న పోలీసుల పట్ల హైకోర్టు సీరియస్ అయ్యింది. హైదరాబాద్ బార్కస్ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఇంటి స్థలంపై హై కోర్టులో పిటిషన్ వేయగా, ఆ పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని బాధితుడిని పోలీసులు బెదిరించిన ట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు బెదిరిస్తున్నారని బాధి తుడు హై కోర్టును ఆశ్రయించారు.
బాధితుడు ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, పోలీసులపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. శాంతి భద్రతలకంటే సివిల్ విషయాల్లోనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు ఎందుకు, హైకోర్టులో ఉన్న పిటిషన్ ను వెనక్కి తీసుకోమని చెప్పడానికి మీరెవరoటూ పోలీసుల పట్ల హై కోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్ని సార్లు చెప్పినా మీరు మారరా ఎండలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారికి పోలీస్ స్టేషన్లో కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వరు, స్టేషనరీ కూడా ఫిర్యాదుదారుడే తెచ్చుకోవాలని చెప్తున్నారని పోలీసుకు చురకలు అంటించింది.
ఇకనైనా పోలీసులు తమ వైఖరి మార్చుకోవాలని, బాధితుడిని బెదిరించిన పోలీసులపై విచారణ జరపాలని ఆదేశించింది. న్యాయస్థానాలు చేసే పని చేయడానికి ప్రయత్నించడం ఆపేయాలని, సివిల్ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను హెచ్చరించింది.