Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Collector Ila Tripathi: నల్లగొండ కలెక్టర్ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్..

ప్రజా దీవెన, నల్లగొండ:
Collector Ila Tripathi: సైబర్ నేరగాళ్ల బరితెగింపు రోజురోజుకు మితి మీరిపోతోంది. సైబర్ నేరగాళ్లు బరి తెగిస్తున్నారనడానికి నల్లగొండలో మంగళవారం జరిగిన సంఘటన ఉదాహరణగా నిలుస్తుంది. రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్న సైబర్ నేరగాళ్ళు ఉన్నతాధికారుల ఫేస్ బుక్ ఐడీలు హ్యాక్ చేస్తున్నారు. అధికారుల ఫొటోలు ఐడీకి జత చేసి బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ క్రమంలో నే నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఫేస్ బుక్ ఐడీ హ్యాక్ కు గురైంది. నా స్నేహితుడు సంతోష్ కుమార్ సీఆర్పీఎఫ్ అధికారి అతడు బదిలీ అయ్యాడు. ఆయన ఇంట్లోని పాత ఫర్నిచర్ సెకండ్ హ్యాండ్ గా అమ్ముతున్నాడు.

అన్ని వస్తువులు బాగున్నాయి. ధర చాలా చౌకగా ఉంది, మీకు నచ్చితే తీసుకోవచ్చటూ ఫేస్బుక్ లో సైబర్ నేరగాళ్లు ఆమె పేరిట పలవురికి మెసేజ్ లు పంపించారు. కాగా ఈ విషయాన్ని కలెక్టరేట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా తమకు ఆ ఫేస్ బుక్ ఐడీతో సంబంధం లేదని పేర్కొనడం కోసం మెరుపు.