Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Police Commissioner CV Anand: డ్రోన్ల సాంకేతికతతో ట్రాఫిక్ నియంత్రణ

–సిటీలో ట్రాఫిక్ నియంత్రణకు గూగుల్ సహకారం
–90 శాతం ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటో మోడ్ లో పనిచేస్తాయి
— హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్

Police Commissioner CV Anand: ప్రజా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్ లో త్వరలో కొత్త ట్రాఫిక్ రూల్స్ రాబోతున్నాయని సిటీ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. హెవీ ట్రాఫిక్, స్కూల్స్ జోన్ల వద్ద డ్రోన్ల ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేపట్ట నున్నట్లు తెలిపారు. శుక్రవారం సీపీ మీడియా సమావేశంలో మాట్లాడు తూ ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్ మెంట్ సిస్టమ్ రూ.100 కోట్ల వ్యవ స్థను ఎల్అండ్ టీ ఇదివరకే ఏర్పా టు చేసిందని దీనిలో ఉన్న అన్ని ఫీ చర్లు ఇప్పటి వరకు ఉపయోగించు కోలేక పోయామన్నారు. కానీ, ఇ ప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల తో గూగుల్ తో ఎంవోయూ చేసు కుని వారి గూగుల్ మ్యాప్ డేటా అనలిటిక్స్ సిస్టమ్స్ ఉపయోగిం చుకుని ట్రాఫిక్ నియంత్రణ వ్యవ స్థను మరింత మెరు గుపరుస్తామ న్నారు. ఎత్తు కలిగిన బిల్డింగ్స్ య జమానులను ఒప్పించి హైరైజ్ కె మెరాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. నగరంలో వీఐపీ మూవ్ మెంట్ కోసం ఉపయోగించే మా న్యువల్ మోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్ ను 15 శాతానికి తగ్గించామని సీవీ ఆ నంద్ చెప్పారు. ప్రస్తుతం సిగ్నల్స్ 85 శాతం ఆటో మోడ్ లో నడుస్తు న్నాయని దీని వల్ల యావరేజ్ స్పీడ్ పెరుగు తుందన్నారు. దీన్ని 90 శా తానికి పెంచేలా కృషి చేస్తున్నామ న్నారు.

హైదరాబాద్ లో 91 లక్షల వెహికి ల్స్ ఉన్నట్లు, ఫోర్ వీలర్ల సంఖ్య కూ డా బాగా పెరిగిందని సీవీ ఆనంద్ చెప్పారు. అన్ని జంక్షన్లలో ట్రాఫిక్ సిబ్బందిని ఏర్పాటు చేయడానికి సిబ్బంది కొరత ఉందన్నారు. అం దువల్ల హైదరాబాద్ సిటీ సెక్యూరి టీ కౌన్సిల్ ట్రాఫిక్ ఫోరం ఆధ్వర్యం లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలి టీలో భాగంగా ట్రాఫిక్ మార్షల్ స్కీ మ్ ను పూర్తి స్థాయిలో అమలు చే యబోతున్నామని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలిగించేలా ఉన్న భారీ వ్యాపార, వాణిజ్య సముదా యాలు, ఆస్పత్రుల వద్ద ట్రాఫిక్ ని యంత్రణకు ఆయా భవనాల స ముదాయాలు బాధ్యత తీసుకోవా ల్సి ఉంటుందన్నారు.