–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Ila Tripathi ప్రజాదీవెన నల్గొండ : నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరుకానున్న ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నకరికల్ పర్యటనపై శనివారం ఆమె నకరేకల్ మినీ స్టేడియంలో ఏర్పాట్ల పై స్థానిక శాసన సభ్యులు వేముల వీరేశం తో కలిసి పర్యవేక్షించారు. సుమారు 3000 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి, స్థానిక శాసనసభ్యులు, ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేయనున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి అవసరమైన వేదిక, టెంట్లు, షామియానా, తాగునీరు, కుర్చీలు, పబ్లిక్ అడ్రస్ సిస్టం, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించాలన్నారు.
మంత్రి పర్యటన వివరాలను జిల్లా కలెక్టర్ తెలియజేస్తూ మంత్రి ఆదివారం ఉదయం 11 గంటల 45 నిమిషాలకు నకిరేకల్ చేరుకొని మినీ స్టేడియం లో నిర్వహించే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి హాజరు అవుతారని, అనంతరం 2 గంటలకు నకిరేకల్ నుండి బయలుదేరి హైదరాబాద్ వెళ్తారని ఆమె తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి నకిరేకల్ పర్యటన దృష్ట్యా నియోజకవర్గంలోని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపిడివోలు, నకిరేకల్ మున్సిపల్ కమిషనర్, ఇతర సంబంధిత అధికారులందరూ వారి వారి విధులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వర్తించి మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, కార్యక్రమ విజయవంతానికి తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, నకిరేకల్ తహసిల్దార్ ,మున్సిపల్ కమిషనర్, తదితరులు ఉన్నారు.