— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Subject Understanding : ప్రజా దీవెన, కనగల్: విద్యార్థులు సబ్జెక్టుపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్ట ర్ ఇలా త్రిపాఠి సూచించారు. శుక్ర వారం ఆమె నల్గొండ జిల్లా కన గల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్ కళాశాలను ఆకస్మికంగా సం దర్శించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సిఈసి తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు.
ఎకనామిక్స్ సబ్జెక్టుపై ఆమె మాట్లా డుతూ సబ్జెక్టు విషయాలపై పూర్తిప ట్టు ఉన్నప్పుడే పరీక్షల్లో మంచి స మాధానాలు రాయగలుగుతారని, అంతేగాక విషయపరిజ్ఞానం వ స్తుం దని, పోటీ పరీక్షల సమయంలో సై తం ఇది ఉపయోగపడే అవకాశం ఉంటుందని తెలిపారు .ఈ సంద ర్భంగా విద్యార్థుల లక్ష్యాలు ,వారి విద్యా సామర్ధ్యాలు, తదితర విష యాలను పరిశీలించారు. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇ చ్చిన వారికి జిల్లా కలెక్టర్ చాక్లెట్లను పంపిణీ చేశారు.
అంతకుముందు జిల్లా కలెక్టర్ కన గల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను సందర్శించి మార్కెట్ యార్డ్ అ భివృద్ధికి చేపట్టాల్సిన ప్రతిపాదన లు తయారుచేసి ప్రభుత్వానికి పం పించాలని మార్కెటింగ్ శాఖ అధి కారులను ఆదేశించారు.ఇదివరకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటో గ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెం కటరెడ్డి కనగల్ మార్కెట్ యార్డ్ సందర్శన సందర్బంగా మార్కెట్ యార్డులో సౌకర్యాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని దృష్టికి తీసుకురాగా,రైతులకు ఇబ్బందులు కలవకుండా పలు అభివృద్ధి కార్య క్రమాలను చేపట్టాలని, ముఖ్యంగా రైతులకు అవసరమే టాయిలెట్ బ్లా క్, మంచినీటి ఆరో ప్లాంట్, రైతులు భోజనం చేసేందుకు డైనింగ్ హాల్, ఆఫీస్ బిల్డింగ్, డ్రైన్, గోదాము తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అంచనాల రూపొం దించి సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా మార్కెట్ యార్డ్ లో ఈ సౌకర్యాలను కల్పించేందుకు గాను ఉన్న అవకాశాలను పరిశీలించారు. సుమారు కోటి 20 లక్షల రూపాయ ల వ్యయంతో ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపించేందుకు సిద్ధం చేయాల్సిందిగా మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఛాయాదే విని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అద నపు కలెక్టర్ జె.శ్రీనివాస్, పౌరస రఫరాల జిల్లా మేనేజర్ హరీష్, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ,మార్కెటింగ్ సెక్రటరీ శ్రీధర్ రాజు, తదితరులు ఉన్నారు.