— నేడు మధ్యాహ్నం లాంఛన ప్రాయంగా నామినేషన్
BJP Ramachandra Rao: ప్రజా దీవెన, హైదరాబాద్: భారతీ య జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా మాజీ ఎ మ్మెల్సీ రామచందర్రావు ఖరారయ్యారు. ఈ మేరకు నామినేషన్ వేయాలని ఆయనను బీజేపీ అధిష్ఠానం ఆదే శించింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు రామచం దర్ రావు నామినేషన్ దాఖలు చే సేందుకు సన్నాహాలు జరుగుతు న్నాయి.
ఇదిలా ఉంటే అధ్యక్ష ఎన్నికకు పెద్ద గా పోటీ లేకుండానే ఏకాభిప్రాయం తో ఎన్నిక జరిపే విధంగా హైకమాం డ్ ఈ నిర్ణయం తీసుకుంది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు సో మవారం నామినేషన్ల స్వీకరణ ఉం టుందని పార్టీ వర్గాలు చెబుతున్నా యి. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కా ర్యాలయంలో మధ్యాహ్నం 2 గంట ల నుంచి సాయంత్రం నాలుగు గం టల వరకు నామినేషన్లను స్వీకరి స్తారు. అదేరోజు సాయంత్రం 4 గం టల నుంచి 5 గంటల వరకు పరిశీ లన, ఉపసంహరణకు అవకాశం కల్పించారు.
జూలై 1వ తేదీన అధ్యక్ష ఎన్నిక, ప్రకటన ఉంటుందని, అధ్యక్ష ఎన్ని క ప్రక్రియలో 119 మంది రాష్ట్ర కౌ న్సిల్ సభ్యులు, 38 జిల్లా శాఖల అ ధ్యక్షులు, 17 మంది జాతీయ కౌన్సి ల్ సభ్యులు పాల్గొంటారు. రాష్ట్ర అ ధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన అంశంపై పార్టీ నాయకత్వం ఇప్ప టికే సన్నాహక సమావేశం నిర్వ హించిన విషయం తెలిసిందే.