— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
Seasonal Diseases : ప్రజా దీవెన, పీఏ పల్లి: సీజనల్ వ్యాధులు సంక్రమించే అవకాశం ఉన్నందున రాబోయే 3 నెలలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు.
గురువారం ఆమె నల్గొండ జిల్లా పీఏ పల్లి మండల కేంద్రంలోని ప్రాథ మిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఏ ఎన్ సి రిజిస్టర్, మందుల స్టాక్ రిజి స్టర్ ,ఓపి, మాత, శిశుమరణాల రిజిస్టర్ లను జిల్లా కలెక్టర్ పరిశీలిం చి వివరాలను తెలుసుకున్నారు. తగినన్ని మందులు స్టాక్ ఉన్నా యా అలాగే సీజనల్ వ్యాధులతో ఆసుపత్రికి వస్తున్న వారి వివరాల ను అడిగి తెలుసుకున్నారు.
వర్షాల కారణంగా రాబోయే 3 నెల లు సీజనల్ వ్యాధులు వచ్చే అవకా శం ఉన్నందున ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్లు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ,ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య సేవలు అం దించాలని,అవసరమైన మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించా రు. వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం వ హించవద్దని ఆమె చెప్పారు.
అనంతరం జిల్లా కలెక్టర్ పీఏ పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని సంద ర్శించి భూభారతి కింద వచ్చిన దర ఖాస్తులను పరిశీలించారు. ఈ సం దర్భంగా భూ భారతి పై తీసుకున్న చర్యలు, సంబంధిత వ్యక్తులకు జా రీచేసిన నోటీసుల వివరాలు, తది తర వివరాలను తహసిల్దార్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.
భూ భారతి కింద వచ్చిన అన్ని దరఖాస్తులకు ముందుగా నోటీసు లు జారీ చేయాలని, అన్ని వివరా లను పోర్టల్ లో అప్లోడ్ చేయాల ని, నోటీసును సైతం పోర్టల్ లో అప్లోడ్ చేయాలని ఆమె సూచిం చారు.ఈ సందర్బంగా పనుల నిమి త్తం తహసిల్దార్ కార్యాలయానికి వచ్చి న రైతులలు, ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూరిబా గాంధీబాలిక విద్యాలయాన్ని తనిఖీ చేసి పాఠశాల పరి శుభ్రతను,వంట గదిని,టాయ్ లెట్లు, విద్యార్థుల చ దువు, భోజనం, తదితర వివరాల ను అడిగి తెలు సుకున్నారు. దేవర కొండ ఆర్డిఓ రమణారెడ్డి జిల్లా కలె క్టర్ వెంట ఉన్నారు.