Road Accident : ప్రజా దీవెన, మహబూబాబాద్: మ హబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపం లో జాతీయ రహదారి 563పై శుక్ర వారం తెల్లవారు జామున ఘోర రో డ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదు రుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దా న బస్తాల లారీ ఢీ కొన్నాయి. ఈ రెండు లారీలు ఢీకొనడంతో మంట లు చెలరేగాయి. ఈ మంటల్లో రెం డు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు. స్థా నికులు పోలీసులకు, అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజే శారు. సమాచారం అందుకున్న అ గ్నిమాపక అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆ ర్పివేశారు.
పోలీసులు సంఘటన స్థలంలో స హా మీయక చర్యలు చేపట్టారు. జా తీయ రహదారి లో ఈ ప్రమాదం జరగడంతో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ని పోలీసులు క్లియర్ చేస్తు న్నారు.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వి జయవాడ నుంచి రొయ్యల మే త లోడుతో ఓలారి గుజరాత్ రా ష్ట్రా నికి వయా మరిపెడ మీదుగా వెళుతున్నారు. ఇదే క్రమంలో కరీం నగర్ నుంచి ఓ గ్రానైట్ లారీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విశాఖపట్నం వైపుగా మరిపెడ మీదుగా వెళుతుంది.ఈ నేపథ్యంలో గుజరాత్ కు వెళు తు న్న లారీ జాతీయ రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి ఎదురు గా వస్తున్న గ్రానైట్ లారీని బలంగా ఢీకొట్టింది.
రెండు లారీలు ఎదురెదురుగా బలం గా ఢీ కొట్టిన ఈ ఘటనలో మంట లు చెలరేగాయి. ఈ మంటల్లో రాజ స్థాన్ రాష్ట్రానికి వెళుతున్న లారీ క్యాబిన్లో ఉన్న డ్రైవర్ సర్వర్ రామ్ (23), క్లీనర్ బర్కత్ ఖాన్ (23), అ దేవిధంగా గ్రానైట్ లారీ క్యాబిన్లోని మరో డ్రై వర్ గూగులో త్ గణేష్ (30) మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయారు.
రాజస్థాన్ లారీలో వెళుతున్న డ్రైవ ర్, క్లీనర్ రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూ ర్ కు చెందినవారీగా గుర్తించారు. సంఘటన స్థలానికి మరిపెడ సీఐ రాజకుమార్, ఎస్సై లు సతీష్, సం తోష్ లు సిబ్బందితో చేరుకుని ఫైర్ ఇంజన్ ద్వారా మంటలను అర్పిం చారు. క్యాబిన్ లో ఇరుక్కొని సజీ వదాహరణమైన డ్రైవర్ల శవాలకు ఘటన స్థలంలోని పంచనామ నిర్వ హించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమో దు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.