Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DGP Alcohol Warning : తెలంగాణ డీజీపీ కీలకవ్యాఖ్య, మ త్తుకు బానిసైతే యువత జీవితాలు నాశనం

DGP Alcohol Warning : ప్రజా దీవెన, కొడంగల్: మత్తుకు బా నిసలై జీవితాలను నాశనం చేసు కోకూడదని యువతకు డైరెక్టర్ జన రల్ ఆఫ్ పోలీస్ జితేందర్ హితవు పలికారు.శుక్రవారం కొడంగల్ ని యోజకవర్గంలో రూ. 10 కోట్ల వ్య యంతో నూతనంగా నిర్మించే పోలీ స్ స్టేషన్లకు పోలీస్ హౌసింగ్ కార్పొ రేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి, జిల్లా క లెక్టర్ ప్రతిక్ జై న్, డిఐజి తాప్సీర్ ఎ గ్బాల్, ఎస్పీ నారాయణరెడ్డి, హౌ సింగ్ ఐజిపి రమేష్ లతో కలిసి డైరె క్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేందర్ కొడంగల్ పట్టణ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో శంకుస్థాపనలు గావించి, భూమి పూజ చేశారు.

కొడంగల్ పోలీస్ స్టేషన్ రూ. 2.96 కోట్లు, సర్కిల్ పోలీస్ స్టేషన్ రూ. 84.50 లక్షలు, దుద్యాల పోలీస్ స్టే షన్ రూ. 3 కోట్లు, బొమ్మరాస్ పెట్ రూ. 2.96 కోట్ల వ్యయంతో నిర్మా ణాలు చేపట్టే పనులకు డైరెక్టర్ ఆ ఫ్ జనరల్ పోలీస్ జనరల్ జితేం దర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా డీజీపీ జితేందర్ మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం అధునాతన సౌకర్యాలతో పోలీస్ స్టేషన్ భవనాలను నిర్మిస్తున్నామ న్నారు. కొడంగల్ పరిధిలో 10 కోట్ల వ్యయంతో నిర్మాణాలు చేపట్టే పోలీ స్ స్టేషన్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పో లీస్ స్టేషన్ల నిర్మాణ పనులను వేగ వంతంగా పూర్తి చేసి అందుబాటు లోకి తీసుకొని వస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మాద కద్రవ్యాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి మాదకద్రవ్యాల తరలింపు పై ప్రత్యే క నిఘాతో దోషులను గుర్తించడం తోపాటు చట్టరీత్యా చర్యలు తీసు కుంటున్నట్లు ఆయన తెలిపారు. యువత చెడు వ్యసనాలకు గురి కావడం వల్ల కుటుంబాలు చెల్లాచె దురు అవుతున్నాయని, ప్రతి ఒక్క రూ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే అనర్ధానాలను తెలుసు కొని తమ జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని ఆయన సూ చించారు.

పోలీస్ స్టేషన్ల శంకుస్థాపన కార్య క్రమంలో తాండూర్ సబ్ కలెక్టర్ ఉ మా శంకర్ ప్రసాద్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, పరిగి డిఎస్పి శ్రీనివాస్,కడ ప్రత్యేక అధికారి వెంక ట్ రెడ్డి, తహసిల్దార్ విజయకు మా ర్, స్థానిక నాయకులు, అధికారు లు పాల్గొన్నారు.