–త్వరితగతిన పూర్తి చేయాలి
–సిపిఎం
Urban Road Widening : ప్రజా దీవెన నల్గొండ : పట్టణంలో బస్టాండ్ నుండి స్టేడియం వరకు, భాస్కర్ టాకీస్ నుండి బిటిఎస్ వరకు రోడ్డు విస్తరణ పనులను కాలయాపన చేయకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి. సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పట్టణంలో రోడ్డు విస్తరణ పనుల కోసం ఇండ్లు, దుకాణాలు, భవనాలు తొలగించి ఒకటిన్నర సంవత్సరం, డ్రైనేజ్ పైప్ లైన్ పనులు ప్రారంభించి ఆరు నెలలు,
రోడ్డు పనులు ప్రారంభించి నాలుగు నెలలు, రోడ్డు మధ్యలో మ్యాన్ హోల్స్ పనుల నిమిత్తం రెండు నెలలు పూర్తి అయిన ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయని అన్నారు.
రోడ్డు విస్తరణ పనులను జాప్యం చేస్తూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని అన్నారు. అధికారులు పర్యవేక్షణ లోపించిందని అన్నారు. రెండున్నర సంవత్సరాలు అవుతున్న పూర్తి గాని రోడ్డు విస్తరణ.. దీనికి తోడు విపరీతమైన వాహనాల రద్దీ ఈ అసంపూర్తి రోడ్డు పనుల వల్ల స్థానిక ప్రజల కళ్ళల్లో, ఇళ్లల్లో కి చేరుతున్న దుమ్ము ధూళి తోటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు చోద్యం చూడకుండా రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయడం ద్వారా ప్రజల ఇబ్బందులు తొలగించాలని వారు డిమాండ్ చేశారు. మిర్యాలగూడ రోడ్ లో బి టి ఎస్ దగ్గర కల్వర్టు నిర్మాణం కోసం రోడ్డు తవ్వి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న కల్వర్టు నిర్మాణం నత్తనడకన సాగుతుందని వెంటనే ఆ కల్వర్టు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గాదె నరసింహ, పాక లింగయ్య, సలివోజు సైదాచారి, తదితరులు పాల్గొన్నారు.