–కుర్రి శ్రీనివాస్ మరణం నన్ను కల చి వేసింది
–కుటుంబానికి అండగా ఉంటాo మంటూ తక్షణ సాయంగా రూ.10 లక్షల అందజేత
Uttam Kumar Reddy : ప్రజా దీవెన, నకిరేకల్: కాంగ్రెస్ పా ర్టీకీ చెందిన కుర్రి శ్రీనివాస్ రోడ్ ప్ర మాదంలో ఆకస్మిక మరణం పాల యిన విషయం తెలిసిన రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. శుక్ర వారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన ఏ.ఐ.సి.సి అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే ముఖ్య అతిధిగా హాజ రైన సామాజిక న్యాయ సమర భేరి సభకు హాజరైన కుర్రి శ్రీనివాస్ తిరు గు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురై దుర్మరణం పాలయ్యారు. విష యం తెలిసిన వెంటనే మంత్రి ఉత్త మ్ కుమార్ రెడ్డి అధికార యంత్రాం గాన్ని అప్రమత్తం చేయడంతో పా టు అవసరమైన సేవలు అందించా లని ఆదేశాలు జారీ చేశారు.
శనివారం ఉదయం నకిరేకల్ ప్రభు త్వ ఆసుపత్రికి చేరుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీనివాస్ పార్థి వ దేహం మీద పుష్ప గుచ్ఛం ఉంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలం చెన్నాయిపాలెంకు చెంది న శ్రీనివాస్ మరణం తనను కలచి వేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు అంటే నా కుటుంబ సబ్యుడిగా భా విస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
దివంగత శ్రీనివాస్ ఇద్దరు పిల్లల వి ద్యాభ్యాసం బాధ్యతలు తాను తీ సుకోవడమే కాకుండా శ్రీనివాస్ సతీ మణికి తగిన ఉపాధి అవకాశం క ల్పిస్తామన్నారు. అప్పటికప్పుడు త క్షణ సహయంగా కుర్రి శ్రీనివాస్ కు టుంబానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పది లక్షల ఆర్థిక సహాయం అం దించారు.