— నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
MLA Vemula Veeresham :
ప్రజా దీవెన, నకిరేకల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ప్రభుత్వం ప్రజలకు చేస్తోన్న మంచి గురించి ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మా ట్లాడుతుంటే ఓర్వలేని బిఆర్ఎస్ వాళ్లకు నిద్ర పట్టడం లేదని నకిరే కల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్ల రైతు భ రోసా ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లు, స న్నబియ్యం, రైతు రుణమాఫీ, 200 యునిట్ కరెంట్ ఉచితం 500 గ్యా స్ సిలిండర్, మహిళలకు ఉచిత బ స్సు ప్రయాణ సౌకర్యం కల్పించా రని గుర్తు చేశారు. నకిరేకల్ ఎమ్మె ల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రతిపక్ష నాయకుడిని చర్చకు ర మ్మని స్వయాన ముఖ్యమంత్రి కో రినా రాకుండా పారిపోయి ఫాం హౌ స్ లో కెసిఆర్ పడుకుండని విమ ర్శించారు. కళ్లు తాగిన కోతి లేక్క కొ డుకు, అల్లుడు మాట్లాడుతున్నార ని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాలేశ్వరం ప్రాజెక్టు మాదిరిగా ప్రభు త్వం కూడా కూలిపోవడం జరిగిం దని, కాళేశ్వరం అవినీతి మీద ఏ ర్పడ్డ కమీషన్ ముందు హరీష్ రా వు, కెసిఆర్ హాజరవ్వాల్సిన పరిస్థి తి ఏర్పడిందని ఎద్దేవా చేశారు.
కాలేశ్వరం మొటర్లు అన్ చేసి నీటి ని విడుదల చేస్తామని మాట్లాడు తున్న బిఆర్ఎస్ కూలిపోయిన ప్రాజెక్టు ఎలా పనికొస్తుందో వాళ్లే చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ఉద్యమ సందర్భంలో లక్ష నాగళ్ళతో రామోజీ ఫిల్మ్ సిటిని దున్నుతామన్న నువ్వు తర్వాత ఏం చేసావని ప్రశ్నించారు.
కాళేశ్వరం పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకున్నారు, తప్ప రైతులకు చు క్క నీరు ఇవ్వలేదని,కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజల నుంచి వచ్చే ఆదరణ చూసి తట్టు కోలేకపోతున్నారని దుయ్యబట్టా రు.పోటిపడి బావమర్దులు మైకులు పట్టుకొని మాట్లాడుతున్నారని, కేసీ ఆర్ ఏమో ఫాంహౌజ్ లో పడుకొని ఉన్నాడని వ్యాఖ్యానించారు. బి ఆర్ఎస్ పార్టీలో దయ్యాలు ఉన్నా యని స్వయాన కేసీఆర్ కూతురు కవితే అన్నదని గుర్తుచేశారు. ఏ టైంలో సాగు నీళ్లు విడుదల చేయా లని అధికారులను తెలుసనని, వా స్తవాలను ప్రజలకు తెలపడం మా ముఖ్యమంత్రికి తెలుసన్నారు. అ హకరం మాటలు మాట్లాడుతున్నా రు కాబట్టి ప్రజలు ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా తీర్పు ఇచ్చారని గు ర్తు చేశారు.
కెటిఆర్, హరిశ్ రావుకి నా ఛాలెంజ్ నల్లగొండ జిల్లాలో గడిచిన 10 సం వత్సరాలో ఎన్ని ఎకరాలకు నీరు అందించారు చెప్పగలరా,నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో నెల్లికల్ లిప్ట్ పూర్తి చేసాన్నారు మరి చేశారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. డబుల్ బెడ్ రూమ్ గురించి, సాగు నీటిని గురించి చర్చ పెడుతామoటే రారు, బిఆర్ఎస్ మాయ మాటలు ప్రజలు నమ్మరని హితవు పలికా రు.
నేడు గ్రామాల్లో ప్రజలు ఆనందంగా ఉన్నారని,రానున్న స్ధానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులదే గెలుపు అని స్పష్టం చేశారు. రైతు లకు ఎరువులు అందుబాటులో ఉ న్నాయని,మీ హయాంలో కనీసం మా అయిటిపాముల సింగిల్ విండో లో ఎరువులు అమ్మలేదని ద్వజమె త్తారు. బిఆర్ఎస్ కి బీ టిం బిజెపి అని పునరుద్ఘాటించారు. ఎస్ ఎల్ బి సి టన్నల్ కుంగిపోవడానికి కార ణం బిఆర్ఎస్ పార్టీ అని, బిఆర్ఎ స్ అంటేనే అవినీతి పార్టీ అని ఆరో పించారు. ఈ మీడియా సమావేశం లో డిసిఎంఎస్ చైర్మన్ బోళ్ల వెంకట రెడ్డి, చామల శ్రీనివాస్, పూజర్ల శo బయ్య, రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.