–కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
–మండలంలో వివిధ గ్రామాలలో నిరసన
MSP Law for Farmers : ప్రజాదీవెన నల్గొండ :రైతాంగానికి మద్దతు ధర చట్టాన్ని అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, కార్పొరేట్లకు కార్మికులను కట్టు బానిసలుగా మార్చే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు డిమాండ్ చేశారు.
బుధవారం నల్గొండ మండలంలోని అప్పాజీపేట కంచనపల్లి తదితర గ్రామాలలో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు కర్షకులు ప్లకార్డులతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడుతూ కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను
ముందుకు తెచ్చిందని అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కనీస వేతనం 26వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు దోచిపెడుతూ మతోన్మాద చర్యల ద్వారా కార్మిక వర్గ ఐక్యతను విచ్చిన్నం చేసే చర్యలను ప్రతిఘటించేందుకు సమ్మె పిలుపు ఇవ్వడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా సమ్మె విజయవంతమైందని కేంద్రానికి ఈ సమ్మె కనువిప్పు కలగాలని వెంటనే కేంద్ర బిజెపి ప్రభుత్వం విధానాలు మార్చుకోవాలని లేనియెడల తగిన విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ, నలపరాజు సైదులు, కాంగ్రెస్ నాయకులు గంగుల సైదులు, తంగళ్ళ యాదగిరిరెడ్డి, పందుల బిక్షం, బొల్లోజు భారతమ్మ, పోలే మణెమ్మ, కాసర్ల సురేందర్ రెడ్డి, కట్ట నారాయణ, పోలే సైదులు, కల్లూరి నగేష్, ఏనుగు వాణి, నల్పరాజు హరి, సమీనా, కల్లూరి జయమ్మ, అయిత గోని శంకర్, దైద భూషణ్, అలుగుబెల్లి శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.