— నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబా బు హెచ్చరిక
Nalgonda Rural SI Saidababu : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నేరాల ను నియంత్రించడంలో ప్రజలంతా భాగస్వాములవ్వాలని నల్లగొండ రూరల్ ఎస్ఐ సైదాబాబు అన్నారు. నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బుధవారం ఆయన మాట్లా డుతూ నల్లగొండ మండల పరిధి లోని బిల్డింగ్ లు, షాపింగ్ కాంప్లెక్స్ లు, దుఖాణాల్లో, రద్దీ ప్రదేశాల్లో త ప్పనిసరిగా సీసీ కెమెరాలు అమ ర్చుకోవాలని అన్నారు. ఇందులో స్వచ్ఛంద సంస్థలు, గ్రామపెద్దలు భాగస్వామ్యం అవ్వాలని సూచిం చారు. నేరాలు జరిగినప్పుడు నిం దితులను పట్టుకోవడానికి సులభ తరం అవుతుందని చెప్పారు.
కొత్తవ్యక్తులు, అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు కానీ, నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్ నెంబర్ 8712670 177కు కానీ ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పారు. తప్పించు కోవచ్చనే అపోహాలతో నేరాలు చేస్తే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానంతో వెంటనే దొరికిపోతారని, చట్టం నుం చి ఎవరూ తప్పించుకోలేరని, కఠిన శిక్షలు అమలు చేసి జైలుకు పంపు తారని హెచ్చరించారు.
సీసీ కెమెరాల ఏర్పాటుచేసుకో వ డానికి యువత ముందుకు రావాల ని, ప్రతి గ్రామంలోని యువత ముం దుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు.