Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Peddireddy Ganesh : పెద్దిరెడ్డి గణేష్ పౌర సన్మాన సభను విజయవంతం చేయండి

Peddireddy Ganesh : ప్రజాదీవెన, సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కేంద్రంలోని త్రివేణి ఫంక్షన్ హాల్ నందు జూలై 13వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగే సుధా బ్యాంక్ ఎండి పెద్దిరెడ్డి గణేష్ పౌర సన్మానం అభినందన సభ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణంలోని ప్రముఖులు, మేధావులు సంగీత అభిమానులు, కళాకారులు సామాజిక స్వచ్ఛంద సేవ సంస్థల సభ్యులు, వ్యాపార, వాణిజ్య వర్గాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సుధాకర్ పివిసి ఎండి, సుధాబ్యాంకు చైర్మన్, ఆహ్వాన కమిటీ అధ్యక్షులు మీలా మహాదేవ్ అన్నారు. శనివారం సుధా బ్యాంకు నందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పెద్దిరెడ్డి గణేష్ గత 20 సంవత్సరాలుగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కళామతల్లికి అనేక రకాలుగా సేవ చేస్తున్నారని, అనేకమంది కళాకారులను సూర్యాపేటకు తీసుకొని వచ్చి వారి ద్వారా త్యాగరాయ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారని అటువంటి కళామతల్లి ముద్దుబిడ్డను సన్మానించుకోవడం మనందరికీ గర్వకారణం అని అన్నారు. పెద్దిరెడ్డి గణేష్ కు ఎన్టీఆర్ స్మారక అవార్డు రావడం చాలా గర్వించదగ్గ విషయమని స్వర్గీయ నందమూరి తారక రామారావు గొప్ప నటుడు అని కళామతల్లికి ఎనలేని సేవ చేశారని తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా తెలియజేశారని అన్నారు. అటువంటి మహానుభావుని అవార్డు గణేష్ కి రావడం నిజంగా సంతోషకరమని వారు తెలిపారు.

 

పెద్దిరెడ్డి గణేష్ సన్మానం అంటే అది సూర్యాపేటకు చేసుకున్న సన్మానంగా భావించాలని ఈ సన్మాన కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత వాగ్దాటి అనంత శ్రీరామ్ రావడం మన అదృష్టంగా భావించాలని, అనంత శ్రీరామ్ సందేశం కూడా వినడానికి పెద్ద సంఖ్యలో రావాలని అన్నారు. గతంలో పెద్దిరెడ్డి గణేష్ సూర్యాపేట పట్టణానికి సుద్దాల అశోక్ తేజ, ఎస్పీ బాలసుబ్రమణ్యం, గొల్లపూడి మారుతీ రావు ,తనికెళ్ల భరణి వంటి ప్రముఖులను తీసుకొని వచ్చి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారని గత 20 ఏళ్లుగా సుధా బ్యాంకు ద్వారా త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆహ్వాన కమిటీ సభ్యులు పెద్దిరెడ్డి రాజా,కక్కిరేణి చంద్రశేఖర్ ,తోట శ్యాం ప్రసాద్ ,అప్పం శ్రీనివాసరావు,మిన్న శివరామకృష్ణ , తికుళ్ళ సాయి రెడ్డి ఇరిగి కోటేశ్వరి, బొలిశెట్టి మధు, తోట సత్యనారాయణ,గాలి శ్రీనివాసు నాయుడు తదితరులు పాల్గొన్నారు.