Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Karunakar : మంత్రి అనుచరుల ఆగడాల పరాకాష్ట కరుణాకర్ ఆత్మహత్యయత్నం

Minister Karunakar  : ప్రజాదీవెన నల్గొండ : నల్లగొండ మున్సిపాలిటీలో చిన్న చిన్న కారణాలు చూపిస్తూ ఔట్సోర్సింగ్ కార్మికులను తొలగించి వేధింపులకు గురి చేస్తున్న మంత్రి అనుచరులు మున్సిపల్ ఔట్సోర్సింగ్ కాంట్రాక్టర్ల ఆగడాలకు పరాకాష్ట ఔట్సోర్సింగ్ ఉద్యోగి కరుణాకర్ ఆత్మహత్య ప్రయత్నం అని మాజీ కౌన్సిలర్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి. సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య, ఆరోపించారు. శనివారం సుందరయ్య భవన్ లో మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి మంత్రి ఇంటి ముందు ఆత్మహత్నం ఘటనపై వారు విలేకరులతో మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సందర్భంలో చిన్న చిన్న కారణాలు చూపిస్తూ పనుల నుండి ఆపుతూ నెలల తరబడి ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం, పనుల నుండి తొలగించడం, లక్షల రూపాయలు వసూలు చేస్తూ కొత్తవారిని పనిలో పెట్టుకోవడం నలగొండ మున్సిపాలిటీలో నిత్య కృత్యమైందని అన్నారు.

 

కరుణాకరు మాత్రమే కాదు ఇంకా అనేకమంది అక్రమంగా తొలగింపబడి కాంట్రాక్టర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారని అన్నారు. కార్మికులను తొలగించిన సందర్భాలలో మంత్రి అనుచరులను కలిసిన పని లో పెట్టుకోకపోవడం, మునిసిపల్ కార్యాలయంలో కరుణాకర్ భార్య ఔట్సోర్సింగ్ పద్ధతి లో స్వీపర్ గా చేస్తున్న ఆమెకు అతి తక్కువ వేతనం 8 వేలు మాత్రమే ఇస్తున్నారు. ఆమెను కూడా ఈ నెల లో తొలగించారు. కాంట్రాక్టర్ల వేధింపులు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా విసుగు చెంది కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు తప్ప వేరే దురుద్దేశం లేదని అన్నారు. సమగ్ర విచారణ జరిపి కరుణాకర్ ను వేధింపులకు గురిచేసిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకోవాలని అక్రమంగా తొలగించిన కార్మికుల అందరిని తిరిగి విధులకు తీసుకొని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేని యడల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కౌన్సిలర్ సిఐటియు పట్టణ కన్వీనర్ అవుట రవీందర్, పట్టణ నాయకులు కోట్ల అశోక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.