Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Revanth Reddy : ఈనెల 14న సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలి

CM Revanth Reddy : శాలిగౌరారం జూలై 12. : శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందాల సమరం రెడ్డి మాట్లాడుతూ జూలై 14న తిరుమలగిరిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. ఈ రేషన్ కార్డుల పంపిణీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు,ఎంపీ లు,ఎమ్మెల్యే లు రాష్ట్ర స్థాయిలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ,ముఖ్య నాయకులు రానున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు నేతృత్వంలో నిర్వహించే భారీ బహిరంగ సభకు శాలిగౌరారం మండల వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని పిలుపునిచ్చారు.

 

శాలిగౌరారం మండల వ్యాప్తంగా జూలై 14న ఉదయం ఎమ్మెల్యే మందుల సామేలు జన్మదినాన్ని నిర్వహించుకుని గ్రామాల వారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తిరుమలగిరికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్
పాదూరి శంకర్ రెడ్డి,వైస్ చైర్మన్ నరిగే నరసింహ,నాయకులు బండపల్లి కొమరయ్య, బెల్లి వీరభద్రం, బొమ్మగాని రవి, కట్టంగూరి సురేందర్ రెడ్డి, దేవరకొండ జయరాజు, బండమీది రమేష్,కర్నాటి కృష్ణ ,పల్స సైదులు, ఇంద్రకంటి యాదయ్య, జమ్ము అశోక్,చెరకు జానీ లింగస్వామి ,నగేష్, జహంగీర్,శ్రీను తదితరులు పాల్గొన్నారు.