బిగ్ బ్రేకింగ్, ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు అస్తమయం
CharacterArtistKotaSrinivasaRao: ప్రజా దీవెన, హైద రాబాద్: తెలుగు చలనచిత్ర రంగంలో సంచలన న టుడు కోటా శ్రీనివాసరావు (83) క న్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆ యన ఈ తెల్లవారుజామున 4 గం టలకు హైదరాబాద్ ని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కోటా శ్రీని వాసరావు దాదాపు 750కు పై గా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడి మృతితో తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
కోట శ్రీనివాస్ రావు సినీ ప్రస్థానం…1978లో ప్రాణం ఖరీదు సిని మాతో సినీరంగ ప్రవేశం చేసిన కోటా 750కిపైగా చిత్రాల్లో నటించా రు. తన 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించారు. తొమ్మిది నది పురస్కారాలు అందుకున్న ఆయనను 2015లో కేంద్ర ప్రభు త్వం పద్మశ్రీ పురస్కారం అందించింది. ఆయనకు ఇద్దరు కుమా ర్తెలు, ఒక కుమారుడు కోటా ప్రసాద్ ఉన్నారు. 2010 జూన్ 21న రోడ్డుప్రమాదంలో ప్రసాద్ మృతిచెందారు.
1942 జులై 10న కృష్ణాజిల్లా కంకిపాడులో కోటా శ్రీనివాసరావు జ న్మించారు. బాల్యం నుంచి నాటకాలంటే చాలా ఆసక్తి కనబడి రిచే వారు. 1978లో ‘ప్రాణం ఖరీదు’తో సినీరంగంలోకి అరంగ్రేటం చేశా రు. కోట శ్రీనివాసరావుకు దర్శక నిర్మాత క్రాంతికుమార్ తొలి అవ కాశం ఇచ్చారు. తన నటన, డైలాగ్ డెలివరీతో విశేష గుర్తింపు తె చ్చుకున్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, హాస్యం, విలనిజం, సెంటిమెంట్, పౌరాణికo ఇలా ఏ తరహా పాత్రనైనా తన దైన శైలిలో పండించారు.
తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు. సినిమాల్లోకి రాకముందు స్టేట్‌బ్యాంకులో పనిచేశారు. సినిమాల్లోనే కాదు.. రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు.1990లలో బీజేపీలో చేరిన ఆయన 1999-2004 వరకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా పనిచేశారు. వృద్ధాప్య సమ స్యల కారణంగా ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటు న్నారు.2023లో వచ్చిన ‘సువర్ణ సుందరి’ ఆయన చివరి చిత్రం. ప్రతిఘటన, గాయం, తీర్పు, లిటిల్ సోల్జర్స్, గణేష్, చిన్నా, ఆ న లుగురు, పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను నంది అవార్డులు అందుకు న్నారు.