Bashiruddin : ప్రజా దీవెన, కోదాడ: పట్టణ పరిధిలోని లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీవాసులకు ప్రభుత్వం పట్టాలు అందజేయాలని సామాజిక ఉద్యమ కార్యకర్త సయ్యద్ బషీరుద్దీన్ అన్నారు ఆదివారం పట్టణ పరిధిలోని లక్ష్మీపురం గ్రామములో లబ్ధిదారుల సమక్షంలో సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక లక్ష్మీపురం గ్రామంలో ఇందిరమ్మ కాలనీ ని 2007 జనవరి 6న భూమి పూజతో ప్రారంభమై 54 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి కోదాడ మేజర్ గ్రామపంచాయతీ గా ఉన్న 20 వార్డుల్లోని లబ్ధిదారులందరికీ గ్రామసభల ద్వారా ఎంపిక చేసి స్థలాలు కేటాయించారు. 18 సంవత్సరాలు గడుస్తున్న నీటికి ఇంటి పట్టాలు ఇవ్వక పోవటం బాధాకరమని తెలిపారు.
నేటికి కాలనీలో మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో లేక కాలనీవాసులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని గతంలో దీక్షలు ధర్నాలు వినతులు ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేసిన సందర్భంగా2013లో లో ఉన్న ప్రభుత్వ అధికారులు హామీ ఇచ్చి దీక్షను విరమింప చేశారని గుర్తు చేశారు ,అయినా నేటి వరకు కార్యాచరణ దాల్చలేదని నాడు మంత్రి నేడు మంత్రి గా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి నేటి కోదాడఎమ్మెల్యే సైతం లక్ష్మీపురం ఇందిరమ్మ కాలనీ మా మానస పుత్రిక అని దీనిని అభివృద్ధి చేస్తామన్న వారి మాటల్ని గుర్తు చేసారు, రెవెన్యూ మున్సిపాలిటీ అధికార యంత్రాంగం ఇందిరమ్మ కాలనీ సమస్యలనుగుర్తించి ఇంటి పట్టాలు ఇవ్వాలని లేనియెడల మరో మారు ఆమరణ నిరాహారదీక్షకు సైతం సిద్ధమని బషిరుద్దీన్ తెలిపారు. . ఈ కార్యక్రమంలో ఎడవల్లి భాస్కరరావు ,మామిడి శంకర్, నాగేశ్వరరావు, నన్నేసాహెబ్, సిద్దయ్య ,నరేష్ డాక్టర్ పాషా, నరసింహ, బడే మియా, వెంకటరత్నం, అబ్దుల్లా ,పెంటు, కోపూరు అన్నపూర్ణ, సరోజా దేవి, మేరీ, ఖాజావి అమీనా షాహిదా తదితరులు పాల్గొన్నారు.