Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Big Breaking : బిగ్ బ్రేకింగ్, అన్నమయ్య జిల్లాలో తెల్లవారుజామున తెల్లారిన కూలీ ల బతుకులు 

Big Breaking : ప్రజా దీవెన, అన్నమయ్య జిల్లా: ఆంధ్రప్రదేశ్‌ అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసు కుంది. సోమవారం తెల్లవారుజా మున లారీ బోల్తా పడడంతో కూ లీల బతుకులు తెల్లారాయి. అ త్యంత ఈ దుర్ఘటనలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. ఈ అత్యంత హృదయ విదారక ఘట న అన్నమయ్య జిల్లాలోని రెడ్డి పల్లె చెరువుకట్టపై చోటుచేసుకుంది.

 

రాజంపేట నుంచి రైల్వేకోడూరు మార్కెట్‌కు మామిడికాయల లోడు తో వెళ్తున్న సమయంలో లారీ అదు పు తప్పి చెరవుకట్టపై బోల్తా పడిం ది. లారీ బోల్తా పడటంతో 10 మం ది కూలీలకు తీవ్రగాయాలు అ య్యాయి.క్షతగాత్రులని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆస్పత్రిలో వైద్యు లు వారి పరిస్థితిని సమీక్షించి చికి త్స అందిస్తున్నారు. తొమ్మిదిమంది మృతుల్లో ఐదుగురు మహిళలు, న లుగురు పురుషులు ఉన్నారు. మృ తులు సబ్బరత్నమ్మ(45), చిట్టెమ్మ (25), గజ్జల లక్ష్మీదేవి (36), రాధ (39), వెంకట సుబ్బమ్మ(37) గజ్జల రమణ(42), మణిచంద్ర(38), గజ్జ ల దర్గయ్య(32), గజ్జల శీను(33) లుగా గుర్తించారు.మృతులు రైల్వే కోడూరు మండలం సెట్టిగుంట వా సులుగా గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం యావత్తు విషాద ఛా యలు అలుముకున్నాయి.

సమాచారం అందగానే ప్రమాద స్థ లానికి చేరుకున్న పోలీసులు సహా యక చర్యలు చేపట్టారు. ఈ ఘట నపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కుటుం బ సభ్యులకు పోలీసులు సమాచా రం అందించారు. ఈ విషయం తెలి యడంతో కుటుంబ సభ్యులు కన్నీ రు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమి త్తం అన్నమయ్య జిల్లాలోని ప్రభు త్వ ఆస్పత్రికి తరలించారు.

 

*ఏపీ సీఎం చంద్రబాబు నాయు డు తీవ్ర దిగ్భ్రాంతి..* ఈ ఘటన పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ది గ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రుల కు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. లారీ బోల్తాపడి తొమ్మది మంది మృత్యు వాత పడటంపై విచారం వ్యక్తం చే శారు. ఈ ప్రమాదానికి గల కారణా లను అధికారులను అడిగి తెలుసు కున్నారు.గాయపడిన వారికి మెరు గైన చికిత్స అందిస్తున్నామని అధి కారులు సీఎంకు తెలిపారు. రాజం పేట నుంచి రైల్వే కోడూరుకు కూలీ లు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధి కారులు సీఎంకు వివరించారు.

 

మృతులంతా రైల్వేకోడూరు సెట్టి గుంట ఎస్టీ కాలనీకి చెందిన కూలీ లని తెలియడంతో సీఎం చంద్రబా బు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనులకు వెళ్లి ఇంటికి వచ్చే సమయంలో మృత్యువాత పడటం బాధాకర మని అన్నారు. మృతుల కుటుంబా లకు ప్రభుత్వం అండగా ఉంటుంద ని భరోసా ఇచ్చారు. ప్ర మాదంలో గాయపడిన వారికి నా ణ్యమైన వై ద్య చికిత్స అందించా లని సీఎం చంద్రబాబు అధికారుల ను ఆదేశించారు.