Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BJP Ramachandra Rao : మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం

*బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే*
” సంక్షేమ పథకాలు అందాల్సింది పేదలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాదు*
*బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు *
BJP Ramachandra Rao : ప్రజా దీవెన, నల్గొండ టౌన్: కాంగ్రెసు పార్టీ ఎన్నికలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి,తెలంగాణ ప్రజలను మోసం చేస్తుంది అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు నారపరాజు రామచందర్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంను విమర్శించారు..
తెలంగాణ రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు స్తానిక సంస్థలలో కల్పించి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని కోరారు..
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి జిల్లాల పర్యటనలో భాగంగా మొట్టమొదటి పర్యటన నల్గొండ జిల్లా నుండే ప్రారంభించారు నల్గొండ జిల్లా నేను పుట్టిన జిల్లా అని ఉద్యమాలకు నిలయం నా నల్గొండ జిల్లా అని కొనియాడారు..


నల్గొండ పట్టణంలోని ఒక ఫంక్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా యన్. రామచంద్ర రావు పాల్గొని ఈ విధంగా మాట్లాడారు
గత ప్రభుత్వం రెండు దఫాలుగా అధికారంలో ఉండి ప్రజలను ఏ విధంగా అయితే మోసం చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా మోసం చేస్తుంది అని ద్వజమెత్తారు..
రానున్న స్తానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ నుండి పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని సూచించారు..
కష్టపడితే విజయం బీజేపీ పార్టీదే నని తెలిపారు,
గతంలో ఒక్క యం ఎల్ ఏ వున్న బిజేపీ పార్టీకి నేడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు,ఎనమిది మంది ఎంపీలు గెలిచారు..ముగ్గురు శాసన మండలి సభ్యులు గెలిపించుకున్నారు అని అన్నారు..
తెలంగాణలో బీజేపీ పార్టీకి మంచి పరిస్థితిలు ఉన్నాయి అని తెలిపారు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన ఏ ఒక్క హామీని అమలుపర్చలేక విఫలమైంది అని ఎద్దేవ చేశారు
హామీలను అమలు చేయలేని ప్రభుత్వంపై పోరాడాలి అని
ప్రజలు ,కార్యకర్తలు రోడ్ ల మీదకు వచ్చి ప్రభుత్వంపై పోరాడాలి అప్పుడే కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది అని అన్నారు
అవినీతి ప్రభుత్వముకు స్వస్థి చెప్పాలి అని అన్నారు..
రాష్ట్రంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృధి చేయడం లేదనీ విమర్శించారు.
కేంద్రం ఇచ్చే నిధులను దుర్వినియగం చేస్తూ ప్రజలను తప్పుదారు పట్టిస్తున్నారు అని విమర్శించారు కేంద్రం నుండి వచ్చే నిధుల గురించి ప్రజలకు తెలియపర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వంకు కోరారు
రాష్ట్రంలో బియ్యం ఇస్తుంది మోదీ ప్రభుత్వం కాదా అని నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను,గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్రం కాదా అని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ను అడుగుతున్నాను రేవంత్ రెడ్డి స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు
రైతులతో చెలగాటం ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ,రైతులను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం,
రైతు బంధుకు ఎగనామం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం రైతురుణ మాఫీనీ పూర్తి స్థాయిలో అమలు పరచకుండా మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు ..
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.
కామారెడ్డి డిక్లరేషన్ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీనీ నిద్రపోనియం,మేము కూడా నిద్రపోము అని రామచందర్ రావు కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు..
ఈ కార్యక్రమంలో యం ఎల్ సి అంజిరెడ్డి ,
మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సునీతా రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శ్యామ్ సుందర్,బిజెపి నాయకులు పిల్లి రామరాజు యాదవ్,దళితమోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండేటి శ్రీధర్,చింత సాంబమూర్తి,గోలి మధుసూదన్ రెడ్డి,వీరెల్లి చంద్రశేఖర్,కట్ట సుధాకర్ రెడ్డి, కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, బీజేపీ నాయకులు బండారు ప్రసాద్ ,బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి పాలకూరి రవిగౌడ్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు..