*ఎన్నికల్లో డబ్బు ప్రభావం తగ్గిస్తామె అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది
*బూతులు తిడితేనే నిజమైన నాయకుడు అవుతాడనేదే భ్రమ
*యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి: రామచంద్ర రావు
Ramachandra Rao : ప్రజా దీవెన, కోదాడ : ప్రధాని మోడీ నేతృత్వంలో భారత్ విద్య వైద్య రక్షణ ఆర్థిక సాంకేతిక రంగాలలో రికార్డు స్థాయిలో అభివృద్ధి దశకు చేరి ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామ చందర్ రావు స్పష్టం చేశారు. కోదాడ శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రసంగించారు. కోదాడ మండలం నల్లబండగూడెం గ్రామానికి చెందిన తాను సొంత ప్రాంతం మమకారంతో బాధ్యత చేపట్టిన తొలి పర్యటన ఇదేనని పేర్కొన్నారు… ఇక్కడి జ్ఞాపకాలు తనకెప్పుడూ మధురస్మృతులేనన్నారు.. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పది సంవత్సరాల కాలంలో రహదారుల విస్తరణ శర వేగంగా జరిగిందని రాష్ట్రంలో 13 జాతీయ రహదారులు వందల కోట్లతో నిర్మాణం జరిగిందన్నారు.. . గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర దేశాల ఎదుటచేయి చాచాల్సిన దుస్థితి ఉండేదని అయితే ఇప్పుడు బిజెపి పాలనలో మనమే పేద దేశాలకు అన్ని రంగాలలో సహాయం చేస్తున్నామని గుర్తు చేశారు కరోనా సమయంలో దేశంలోని 140 కోట్ల మందికి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను సరఫరా చేయడమే కాక ప్రపంచంలోని 150 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ ని పంపిణీ చేసిన చరిత్ర మనకుందన్నారు. బిజెపి నేతృత్వంలో..
2047 కల్లా భారతదేశ ప్రపంచంలోనే అగ్రగామి దేశంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. దూకుడుగా వ్యవహరించటం అంటే బూతులు మాట్లాడడం వివాదాలు సృష్టించటం. దాడులు చేయటం కాదని రాజకీయ నేతలు ప్రజాస్వామ్య యుతంగా వ్యవహరించాలని.. పార్టీ తమకుఅదే నేర్పిందన్నారు.. ప్రతిపక్షాల నేతలు ప్రత్యర్ధులే కానీ శత్రువుల కారని వ్యక్తిగత దూషణ సరికాదన్నారు… రాష్ట్రంలో తమ పార్టీ ఇప్పటికే రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే స్థాయికి ఎదిగిందని స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటుతామన్నారు.. ఎన్నికలలో ధన ప్రవాహం నిలువరించబడితేనే ప్రజాస్వామ్యం పరిరవిల్లుతుందని. నేటి యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలని తెలిపారు భారత దేశ యువత యువకులు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.. అనంతరం మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు పాండురంగారావు తో పాటు పలు అసోసియేషన్ల బాధ్యులు రామచంద్రరావును పూలమాలలో శాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ సమ్మేళనంలో డాక్టర్ జాస్తి సుబ్బారావు బిజెపి నాయకులు సంకినేని వెంకటేశ్వరరావు చల్లా శ్రీలత రెడ్డి అక్కిరాజు యశ్వంత్ కనగాల వెంకటరామయ్య, జుట్టు కుండ సత్యనారాయణ. నూనె సులోచన కనగాల నారాయణ నాగాచారి డాక్టర్ రంగాచారి డాక్టర్ రాఘవరావు బొలిశెట్టి కృష్ణయ్య. ఓరుగంటి కిట్టు. న్యాయవాది ఎస్ ఆర్ కె మూర్తి ,మేకల వెంకట్రావు నీల సత్యనారాయణ. పందిరి నాగిరెడ్డి ముత్తినేని సైదేశ్వర రావు, చెన్నకేశవరావు బిజెపి నాయకులు మిత్రులు శ్రేయోభిలాషులు పట్టణ ప్రముఖులు వివిధ పార్టీల రాజకీయ నాయకులు ప్రజలు పాల్గొన్నారు