*రాష్ట్ర ప్రజలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం
*కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉన్నారు : కవిత
Local Elections : ప్రజా దీవెన ,కోదాడ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని కోదాడ మాజీ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో ఆమె నివాస గృహంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను నీకు ఇబ్బందులకు గురి చేస్తూ విస్మరించారని ఆమె తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారని తెలిపారు రాష్ట్రంలో మహిళలకు స్వేచ్ఛ లేదని తెలిపారు .
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చెట్టి సురేష్ నాయుడు సిమ్మిరాల మాజీ పిఎసిఎస్ చైర్మన్ ముత్తవరపు రమేష్ ,బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శీలం సైదులు ,ఎర్రవరం టిఆర్ఎస్ ఇంచార్జి వేమూరి మాధవరావు, మండల కో ఆప్షన్ నెంబర్ ఎస్కే ఉద్దండు ,పట్టణ యువజన అధ్యక్షులు ఇమ్రాన్ ఖాన్, మహిళా పట్టణ అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ,పట్టణ మరియు గ్రామ బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు