Foodpoison : ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్ర వ్యాప్తంగా సంచ లనం సృష్టించిన నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ ముది గొండ ఆశ్రమ పాఠశాలలో జరిగిన విషయంలో విషాదసంఘ టన లో ప్రభుత్వం దిద్దుపాటు చర్య లకు ఉపక్రమించింది. విదుల పట్ల నిర్లక్ష్యం వహిం చడమే కాకుండా, వంట చేసే నాలుగవ తరగతి ఉ ద్యోగులకు నా ణ్యమైన భోజనం తయారీ పట్ల సరైన సూచనలు ఇ వ్వకపో వడం వల్ల ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు ప్రభుత్వం నిర్ధా రణకు వచ్చింది. దేవరకొండ మండలం, కమలాపూర్ (ము ది గొండ )గిరిజన సంక్షే మ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చెందిన 32 మందివిద్యార్థినిలు ఈనెల 14న అనారోగ్యానికి గురైన విషయం తె లిసిందే.
ఈ హృదయ విదారక సంఘటనకు కారణమైన కమలాపూర్ ( ము దిగొండ) గిరిజన సంక్షేమ బాలికల ఆ శ్రమ ఉన్నత పాఠశాల హె డ్మాస్టర్ (పూర్తి అదనపు బాధ్యతలు) వే దా ద్రిని తక్షణమే విధుల నుండి సస్పెం డ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ క్రమశిక్షణ చర్యలకు సంబంధించిన ఉత్తర్వు లు తక్షణమే అమ లులోకి వస్తాయని స్పష్టంచేశారు.