Uppal flyover : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ముఖ్యమంత్రి ఎనుముల రేవం త్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభు త్వం హయాంలోనే ప్రతిష్టాత్మకమై న హైదరాబాద్ ఉప్పల్ ఫ్లైఓవర్ పనులు శరవేగంగా ముందుకు సాగుతున్నాయని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్ పై ప్ర త్యేక శ్రద్ధ, ఆర్థికవనరులతో ఫ్లైఓవర్ నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగిం దని అన్నారు. బుధవారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఉప్పల్ ఎమ్మె ల్యే బండారి లక్ష్మారెడ్డి లతో కలిసి ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
యాదగిరిగుట్ట భువనగిరి వరంగల్ హైవేపై దాదాపు 8 సంవత్సరాల క్రి తం ప్రారంభించిన ఫ్లైఓవర్ పనులు ఆర్థికవనరులు, ఇతర కారణాల వ ల్ల తీవ్రజాప్యం జరిగిందన్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్లైఓవర్ పై ప్రత్యేక దృష్టి సారించి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సైతం చర్చలు జరిపి పనుల్లో వేగిరం పెం చామన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒ ప్పించి మొన్న టి వరకు పనులు ని ర్వహించిన కాంట్రాక్టర్ ను సైతం మార్చి కొత్తవారికి పనులు అప్పగిం చామని ప్రత్యేక శ్రద్ధతో పనుల్లో వే గాన్ని పెంచి త్వరితగతిన పూర్తి చే స్తామన్నారు.
హైదరాబాద్ నగరంలో పివి ఎక్స్ ప్రె స్ హైవే తర్వాత అతిపెద్ద ఫ్లై ఓవర్ గా ఉప్పల్ ఫ్లైఓవర్ నిలువనుందని వచ్చే దసరా నాటికి ఫ్లైఓవర్ పను లు పూర్తి చేసి ప్రజలకు అందుబా టులోకి తెస్తామని అన్నారు.