80 వేల విలువగల బెంచీలు,డెస్క్ ల అందజేత..
విద్యార్థులకు బ్యాగులు,నోట్ బుక్స్ పంపిణి.
Chittalur ZP School :శాలిగౌరారం జూలై 17. : శాలిగౌరారం మండలం చిత్తలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మెండుగా దాతల సహకారం లభించింది.గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సి ఎస్ ఆర్ ) కార్యక్రమం లో భాగంగా పాఠశాలకు 80 వేల రూపాయల విలువగల 15 డెస్క్ లను, 15 బెంచీలను అందజేశారు.పాఠశాల లో చదువుతున్న 43 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్ బుక్స్,స్కూల్ బ్యాగులు,పెన్నులు, పెన్సిల్స్,గ్రాఫ్ నోట్ బుక్స్,జామెట్రిబాక్స్ లు,వాటర్ బాటిల్స్ మొదలైన స్టేషనరీ సామాగ్రిని అందజేశారు.ఈ సందర్బంగా గజ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ జనరల్ మేనేజర్లు వి.జనార్దన్,జి. అప్పలకొండ, ఎన్. సాంబమూర్తి లు మాట్లాడుతూ తమ సంస్థ సాధించిన లాభాలలో కొంత ప్రభుత్వ పాఠశాలలకు, విద్యార్థులకు అందించాల్సిన ఆలోచన తమకు కలిగిందన్నారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు కోరారు.
ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలు సామాజిక భాద్యత తీసుకొని విద్యాభివృద్ధికి, విద్యార్థులకు చేయూత నీయటం అభినందనీయమన్నారు.తమ పాఠశాలకు ఎంచుకొని దాతృత్వాన్ని పంచుకున్న
గజ ఇంజనీరింగ్ ప్రవేట్ లిమిటెడ్ వారికి గ్రామస్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆర్. జ్యోతి,శాలిగౌరారం మార్కెట్ ఛైర్మెన్ పాదూరి శంకర్ రెడ్డి,పాఠశాల ఛైర్మెన్లు సోమలక్ష్మి రాములు,మాజీ సర్పంచ్ బొమ్మగాని రవి,వార్డ్ సభ్యులు దాసరి లలితా దేవచిత్తం,అల్లే రాములు,ఉపాధ్యాయులు ప్రియాంక, సత్తిరెడ్డి, చంద్రశేఖర్, వనజాత, ఖాదర్ పాషా, పూజ, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.