–కష్టాల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలబడతా అన్నాడు
–ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఆపదలో ఆదుకున్నాడు
–నిస్సహాయక స్థితిలో ఉన్న వ్యక్తికి చికిత్స చేయిస్తున్నారు
–మునుగోడు నియోజకవర్గంలో పే దలపాలిట పెన్నిధిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజాదీవెన,మునుగోడు: ఎదిగిన బి డ్డ కండ్ల ముందే కదలలేని స్థితి రెక్కలు ముక్కలు చేసుకొని సం పాదించిన కొద్ది మొత్తానికి తోడు లక్షల రూపాయలు అప్పులు చేసి చికిత్స చేయించిన బిడ్డ కదలక పాయే.. మెదలకపాయె గుర్తుపట్టక పాయె.తమ కష్టం పగోడికి కూడా రావద్దు అంటూ మొక్కని దేవుడు లేడు తలవని దేవత లేదు.మాకు ఎవరు దిక్కురా దేవుడా అని ఎ దురుచూస్తున్న తరుణంలో మన సున్న మారాజు మునుగోడు ఎమ్మె ల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఇచ్చిన భరోసా ఆ కుటుంబానికి కొం డంత ధైర్యాన్ని ఇచ్చింది.
నీ కొడుకును కార్పొరేట్ ఆసుపత్రి లో చేర్పించి మెరుగైన చికిత్స అం దిస్తానని రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీతో బిడ్డ పై ఆశలు చిగురించా యి. ఇచ్చిన హామీ ప్రకారం గురువా రం యశోద ఆసుపత్రిలో చేర్పించి కదలలేని నిస్సహాయక స్థితిలో ఉ న్న తిరుపతయ్య కు చికిత్స అంది స్తున్నారు.నల్గొండ జిల్లా మునుగో డు నియోజకవర్గం మర్రిగూడ మం డలం ఎరగండ్లపల్లి గ్రామానికి చెం దిన చామకూరి తిరుపతయ్య గత రెండు సంవత్సరాల క్రితం కుటుం బంలో గొడవపడి ఆవేశంతో పాయి జన్ తీసుకున్నాడు.
ఆసుపత్రులో చేర్పించి లక్షల రూ పాయలు అప్పులు చేసి చికిత్స అం దించినప్పటికీ బ్రతికాడు గాని కద లలేడు, మెదలలేడు. ఎవరిని గుర్తు పట్టలేడు. ఎదిగిన కొడుకు జీవచ్ఛా వంలో ఇంట్లో ఉండడంతో ఆ తల్లి దండ్రులు అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. తల్లిదండ్రుల తో పాటు తన భర్త మెరుగైన చికి త్స కోసం ఉన్న అర ఎకరం అమ్మిం ది భార్య నర్మద. తనకున్న ఇద్దరు చిన్న పిల్లలతో పాటు జీవచ్ఛవంలా మారిన భర్తకు సేవ చేస్తూ కూలీ ప ని చేసుకుంటూ జీవనం వెలదీస్తోం ది.
అయితే గత జూన్ నెల 27వ తేదీ న గ్రామ సమస్యలు తెలుసుకోవడా నికి ఎర్రగండ్ల పెళ్లి గ్రామానికి మా ర్నింగ్ వాక్ కి వెళ్లిన మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దృష్టికి తిరుపతయ్య పడుతున్న ఇబ్బందిని వారి కుటుం బం ఆవేదనను స్థానిక నాయకులు తీసుకెళ్లారు. అదే రజు తిరుప త య్య తిరిగి మంచి మనిషి అవ్వడా నికి నా వంతు ప్రయత్నం చేస్తానని మాట ఇస్తూనే ధైర్యం కోల్పోవద్దని మీకు నేనున్నానన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇచ్చిన మాట ప్ర కారం గురువారం హైదరాబా దు లోని యశోద ఆసుపత్రిలో తిరు పతయ్యకు చికిత్స చేయిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఆదే శంతో ఎరగండ్లపల్లి నాయకులు తిరుపతయ్యను యశోద ఆసుప త్రికి తీసుకెళ్లడంతో చికిత్స ప్రారం భించారు వైద్యులు.తిరుపతయ్య తిరిగి కోలుకోవడానికి మానవ ప్ర యత్నంగా తన వంతు సహకారం అందిస్తానని ఇచ్చిన మాట ప్రకారం తిరుపతయ్యకు చికిత్స చేయిస్తుం డడంతో కుటుంబ సభ్యులకు ధై ర్యం వచ్చినట్లయింది.