–వామపక్ష విద్యార్థి సంఘాలు
Educational Institutions : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు,జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నల్లగొండలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలిపారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్, వెంటనే విడుదల చేయాలి. గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలి. మెస్ కాస్మోటిక్ ఛార్జీలను పెంచాలి. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి.
బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా
నూతన జాతీయ విద్య విధానం( ఎన్ ఈ పి 2020) తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని డిమాండ్ చేశారు. డిమాండ్లన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.తలపెట్టిన విద్యాసంస్థల బంద్ ను విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ముదిగొండ మురళీకృష్ణ, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వలమల్ల ఆంజనేయులు, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరు సాగర్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, పిడిఎస్ యు జిల్లా కార్యదర్శి పవన్, ఏఐఎఫ్ డి ఎస్ జిల్లా కార్యదర్శి కాశి, నాయకులు సూర్య తేజ, సోయల్, తదితరులు పాల్గొన్నారు.